బిగ్‌బాస్‌: అవినాష్ గుట్టు విప్ప‌నున్న నాగ్‌

Bigg Boss 4 Telugu: Special Bond Between Ariyana Glory, Mukku Avinash - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న జంట‌లు స‌రిపోవ‌ని ఈ మ‌ధ్య కొత్త జంట పుట్టుకొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లో అడుగు పెట్టిన అవినాష్ వ‌చ్చీ రాగానే మెనాల్ వెంట ప‌డ్డాడు. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో అరియానాతో క్లోజ్‌గా ఉంటున్నాడు. ఆమె కూడా అత‌డికి ప్ర‌తీ విష‌యంలో బాగా స‌పోర్ట్ చేస్తోంది. టాస్కులోనూ అత‌ని కాయిన్లు దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌స్తుంటే అవినాష్‌ను నిద్ర లేపి మ‌రీ హెచ్చ‌రించింది. ఎవ‌రి కాయిన్లు తీసినా అత‌నివి మాత్రం తీయొద్ద‌ని మిగ‌తా హౌస్‌మేట్స్‌ను వేడుకుంది. అలాగే నిన్న‌టి ఎపిసోడ్‌లో అద్దం టాస్క్‌లో భాగంగా అవినాష్ చేసిన‌ కామెడీకి సుజాత హ‌ర్ట్ అయింది. దీంతో ఇలాంటి టాస్కులు ఇవ్వ‌కండని అవినాష్‌ బిగ్‌బాస్‌కు చెప్పాడు. అయితే అలా చెప్ప‌డం త‌ప్ప‌ని, ఒక‌రికోసం నువ్వెందుకు మానుకుంటావ‌ని అత‌డికి పాజిటివిటీని నూరిపోసింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అరియానా నోరు మూయించిన గంగ‌వ్వ‌)

ఇంకాస్త వెన‌క్కు వెళ్తే.. అరియానా, అవినాష్‌లు సోఫాపై వేలితో రాస్తూ ఏదేదో మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత అత‌డికి గ‌ట్టిగా ఓ హ‌గ్గిచ్చింది కూడా! కానీ ఆ సైగ‌ల భాష వారికి త‌ప్ప ఇంకెవ‌రికీ అర్థం కాలేదు. దీంతో అప్ప‌టినుంచి ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ జ‌రుగుతోందంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. నేటి ఎపిసోడ్‌లో నాగ్ కూడా వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుందో వారితోనే చెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అరియానా అన్నింటికీ త‌లాడిస్తున్న‌ప్ప‌టికీ, అవినాష్ మాత్రం ఎక్క‌డ బండారం బ‌య‌ట‌ప‌డిపోతుందోన‌ని ఆపేయండి సార్ అంటూ నాగ్‌ను చేతులెత్తి వేడుకుంటున్నాడు. మ‌రి ఈ ఇద్ద‌రి సీక్రెట్‌ల‌ను నాగ్ ఎలా బ‌య‌ట‌పెట్టనున్నాడ‌నేది తెలియాలంటే ఇంకొద్ది గంట‌లు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top