ఇద్ద‌రిని ఏడిపించిన అరియానా

Bigg Boss 4 Telugu: Ariyana Glory Is The Main Reason For Fight - Sakshi

బిగ్‌బాస్ ఇంట్లోకి వ‌చ్చీరావ‌డంతోనే కలిసి ఉన్న కంటెస్టెంట్ల మ‌ధ్య చిచ్చు పెట్టింది అరియానా. ఆమె రాక‌తో ఇంట్లో గొడ‌వ‌లు, ఏడుపులు మ‌ళ్లీ షురూ అయ్యాయి. అస‌లు  నేటి ఎపిసోడ్‌లో ఏం జ‌రిగిందంటే.. రోజంతా తిండి పెట్ట‌లేద‌న్న కోపంతో అరియానా గ్లోరీ, స‌య్య‌ద్ సోహైల్ ఖాళీ క‌డుపుతోనే బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగు పెట్టారు. వ‌చ్చీరాగానే పొద్దున్నుంచి ఏమీ తిన‌లేదు.. ఎందుకు ఫోన్ క‌ట్ చేశారు? అని అరియానా, సోహైల్.. నోయ‌ల్‌ను నిల‌దీశారు. ఫోన్ పెట్టేయ‌డం వ‌ల్లే ఇప్పుడు మీరు ఇద్ద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని నోయ‌ల్ బ‌దులిచ్చాడు. అయినా బిగ్‌బాస్‌లా ఎలా మాట్లాడ‌తార‌ని అభిజిత్ అడ‌గ‌డంతో అత‌నికి సోహైల్‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. అర‌వ‌డం త‌న‌కూ వ‌చ్చంటూ సోహైల్ ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో మిగ‌తా కంటెస్టెంట్లు క‌లుగ‌జేసుకుని కొత్త‌గా ఇంట్లోకి వ‌చ్చిన‌ ఇద్ద‌రినీ తిన‌డానికి పంపించారు. (చ‌ద‌వండి: శివ‌జ్యోతిని మించిపోయిన మోనాల్‌)

నిప్పు రాజేసిన అరియానా
త‌న‌కు తాను స్పెష‌ల్ అని భావించే అరియానా ఎవ‌రైనా తినిపిస్తేనే తింటాన‌ని చిన్న‌పిల్ల‌లా మారాం చేసింది. ప్లీజ్‌.. తినిపించండి అని అడ‌గ్గానే అఖిల్ ఆమెకు గోరుముద్ద‌లు తినిపించాడు. ఇది ఇత‌ర కంటెస్టెంట్ల‌కు మింగుడు ప‌డ‌లేదు. ఇది కూడా టాస్కేన‌ని, తినిపించ‌డం వ‌ద్ద‌ని వారించ‌డంతో తాను గోరుముద్ద‌లు పెట్ట‌లేన‌ని చెప్పేశాడు. దీంతో క‌ల్యాణి ఆమెకు ప్లేటు అందుకుని తినిపించింది. కానీ అఖిల్ అరియానాకు తినిపించిన విష‌యంలో ర‌భ‌స చోటు చేసుకుంది. త‌నకెవ‌రూ తినిపించ‌లేద‌ని, అందుకే ఆమె అడ‌గ్గానే తినిపించానంటూ బోరుమ‌ని ఏడ్చాడు. అరియానాకు తినిపించ‌డం వ‌ల్ల క‌ల్యాణి కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. (చ‌ద‌వండి: క‌ట్ట‌ప్ప అత‌నే అంటున్న గంగ‌వ్వ‌)

గొడ‌వంతా జ‌స్ట్ టాస్క్‌:  సోహైల్‌
అఖిల్ ఏడుస్తుంటే చూసి కూడా అరియానా ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మనార్హం. ఇల్లు చూపించ‌మ‌ని అరియానా అడిగితే తాను చూపించ‌ను పొమ్మ‌ని హారిక తేల్చి చెప్పింది. ఇక‌ ఇంట్లోకి వ‌చ్చాక‌ అరియానా ప్ర‌వ‌ర్త‌న చూసి సోహైల్ కూడా ఖంగు తిన్నాడు. అస‌లు తినిపించ‌మ‌ని ఎందుకు అడుగుతున్నావ్‌? అని ఆరా తీయ‌గా ఇది నా గేమ్ అని స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ గొడ‌వ అంత‌టికీ నిప్పు రాజేసింది అరియానా అని స్ప‌ష్టంగా తేలిపోయింది. ఇది మంచిప‌ద్ధ‌తి కాదు, ఇలా చేయ‌కూడ‌దు, బాగోదు అని సోహైల్ న‌చ్చ‌చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ నా ఇష్టం, ఇదే క‌రెక్ట్, నాకు ఇలానే బాగుందంటూ మొండికేసింది. అయితే వ‌చ్చీరాగానే గొడ‌వ పెట్టుకోవ‌డం ఓ టాస్క్ అని సోహైల్ ఇత‌ర కంటెస్టెంట్ల‌కు చెప్పాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్స్‌..)

అరియానాపై ప్ర‌తాపం చూపించిన గంగ‌వ్వ‌
ఇక త‌ర్వాతి రోజు కంటెస్టెంట్లు ఎప్ప‌టిలాగే డ్యాన్స్ చేశారు. గంగ‌వ్వ అయితే మ‌రీ హుషారుగా క‌నిపించింది. డంబెల్స్ ఎత్తుకుని ఎక్స‌ర్‌సైజ్ చేసింది. బిగ్‌బాస్ అని కేకేస్తూ కెమెరాకు ముద్దులు పెట్టింది. ఆ త‌ర్వాత‌ అవ్వ‌తో హారిక కాసేపు ముచ్చ‌ట్లు పెట్టింది. ఒక‌వేళ స‌డ‌న్‌గా ఎవ‌రైనా వ‌చ్చి న‌న్ను తీసుకుపోయార‌నుకో.. నీ చీర‌ల‌న్నీ ఇస్తే న‌న్ను పంపిస్తాం అంటే నువ్వు చీర‌లిస్తావా? అని హారిక అడిగితే ఎందుకు ఇస్తా, పోతే పో అని తేల్చి చెప్పింది. దీంతో లాస్య‌, హారిక ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత హారిక‌ను కూల్ చేసేందుకు అవ్వ‌ ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చింది. ఇంత‌లో చీర‌కు మ్యాచింగ్ ఐత‌ది.. లిప్‌స్టిక్ పెట్టుకో అని అరియానా ఇచ్చిన స‌ల‌హాకు గంగ‌వ్వ కోపం న‌షాళానికెక్కింది. నాకేం వ‌ద్దు, ఎందుక‌రుస్తున్న‌వ్ ఇక్క‌డ‌ పో అని హెచ్చ‌రించింది. (చ‌ద‌వండి:బిగ్‌బాస్: 'అత‌ను‌ ఓవ‌రాక్ష‌న్ త‌గ్గించుకుంటే మంచిది' )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-10-2020
Oct 26, 2020, 23:24 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మోనాల్ ట్ర‌యాంగిల్ స్టోరీ బ‌య‌ట మాత్ర‌మే కాదు, హౌస్‌లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆరోవారం నామినేష‌న్‌లో మోనాల్...
26-10-2020
Oct 26, 2020, 19:34 IST
బిగ్‌బాస్ షోలో అత్యంత క‌ష్ట‌మైనది నామినేష‌న్ ప్రక్రియ‌. అప్ప‌టివ‌రకు అంద‌రితో న‌వ్వుతూ క‌లివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేష‌న్ వ‌చ్చేస‌రికి మాత్రం...
26-10-2020
Oct 26, 2020, 17:43 IST
టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున అక్కినేని బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న న‌టిస్తున్న‌ వైల్డ్‌డాగ్...
26-10-2020
Oct 26, 2020, 15:49 IST
స‌మంత వ‌చ్చిన వేళావిశేషం.. ఎలిమినేష‌న్ ఉండ‌దేమో అని కంటెస్టెంట్లు తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ వారి ఆశ‌ల‌ను నీరుగారుస్తూ దివి ఎలిమినేట్...
25-10-2020
Oct 25, 2020, 19:10 IST
న‌ట‌నా సామ్రాజ్య‌పు మ‌హారాణి, సిరివెన్నెల విర‌బోణి స‌మంత బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ద‌స‌రా స్పెష‌ల్ మ‌హా ఎపిసోడ్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌హ‌రించింది....
25-10-2020
Oct 25, 2020, 16:38 IST
డిటెక్టివ్‌గా వ‌చ్చిన‌ హైప‌ర్ ఆది, ఇక పంచులే పంచులు
25-10-2020
Oct 25, 2020, 15:41 IST
ద‌స‌రా కానుక‌గా ఈసారి ఎలిమినేష‌న్ ఉండ‌దు కాబోలు అనుకున్నారంతా! ఒక‌వేళ ఉన్నా మోనాల్ గ‌జ్జ‌ర్‌నే సానంపుతార‌ని ఫిక్స్ అయ్యారు. కానీ...
24-10-2020
Oct 24, 2020, 16:57 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో తొలిసారి హోస్ట్‌ లేకుండా ఈ శనివారం ఎపిసోడ్‌ జరగనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌...
23-10-2020
Oct 23, 2020, 23:14 IST
అఖిల్‌, అభిజిత్ బ‌ద్ధ శ‌త్రువులుగానే అంద‌రికీ తెలుసు. కానీ నేటి ఎపిసోడ్‌లో మాత్రం ఒక‌రి మీద ఒక‌రు జోకులు వేసుకోవ‌డంతో...
23-10-2020
Oct 23, 2020, 18:47 IST
బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో మాత్ర‌మే కాదు ప్రేక్ష‌కుల ఓట్ల‌తో కూడా ఆట‌లాడుతున్నాడు. అత్య‌ధికంగా ఓట్లు వేస్తున్న కంటెస్టెంట్ల‌ను కాద‌ని త‌మ‌కు న‌చ్చిన‌వారిని...
23-10-2020
Oct 23, 2020, 17:40 IST
టాస్కేదైనా అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు గొడ‌వ ప‌డ‌టం మామూలైపోయింది. బిగ్‌బాస్ సినిమా తీయ‌మ‌ని చెప్తే అందులో కూడా మాస్ట‌ర్ అభిజిత్‌తో వాగ్వాదానికి...
23-10-2020
Oct 23, 2020, 15:45 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో చాలావ‌ర‌కు పాత టాస్కుల‌నే తిరిగి ప్ర‌వేశ‌పెడుతున్నారు. కొత్త‌గా ఆలోచించ‌డానికి బిగ్‌బాస్‌కు బ‌ద్ధ‌కం అనుకుంటా అని చాలామంది...
22-10-2020
Oct 22, 2020, 23:21 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఏడో కెప్టెన్‌గా అవినాష్ ఎన్నిక‌య్యాడు. కెప్టెన్ అయ్యాడ‌న్న మాటేకానీ త‌న స్నేహితురాలు అరియానా కెప్టెన్ అవ్వ‌లేద‌న్న...
22-10-2020
Oct 22, 2020, 20:30 IST
నేను చ‌నిపోయాకైనా మీకు అర్థ‌మ‌వుతుంది: నోయ‌ల్‌
22-10-2020
Oct 22, 2020, 19:35 IST
కంటెస్టెంట్లు క‌లిసిపోయేలా బిగ్‌బాసే ప్లాన్ చేస్తాడు. మ‌ళ్లీ వారిని విడ‌దీసేందుకు ప‌థ‌కాలు ర‌చిస్తాడు. స్నేహితుల మ‌ధ్య నామినేష‌న్ చిచ్చు పెడ‌తాడు....
22-10-2020
Oct 22, 2020, 18:36 IST
దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. క‌రోనా కాలంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక అల్లాడిపోతున్న జ‌నాల‌కు తానున్నానంటూ అభ‌య హ‌స్త‌మిచ్చింది....
22-10-2020
Oct 22, 2020, 15:36 IST
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇంకో ప‌న్నెండు మంది ఉన్నారు. షో అర్ధ‌శ‌త‌కం పూర్తి...
22-10-2020
Oct 22, 2020, 13:04 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఏడవ వారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంట్లో 12 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు ఇంటి...
21-10-2020
Oct 21, 2020, 23:21 IST
మంచికి చెడుకు జ‌రుగుతున్న యుద్ధంలో రాక్ష‌సులు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించారు. నానార‌కాలుగా హింసిస్తూ చెల‌రేగిపోయారు. అయినా స‌రే చెడుపై విజ‌యం సాధించింది....
21-10-2020
Oct 21, 2020, 18:56 IST
బిగ్‌బాస్ అంటేనే ఒక బొమ్మ‌లాట‌. కంటెస్టెంట్ల‌తో ర‌క‌ర‌కాల ఆటలాడిస్తాడు. న‌టించాలంటాడు, న‌వ్వించాలంటాడు, ఎమోష‌న్స్ దాచేయాలంటాడు. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ కూడా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top