బిగ్‌బాస్‌: ఆ ఇద్ద‌రికీ తిండి పెట్ట‌లేదు

Bigg Boss 4 Telugu: Gangavva Says Maybe Akhil Is Kattappa - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజన్‌లో కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగు పెట్టిన‌ మొద‌టి రోజే త‌గాదాల‌తో, అర్థం ప‌ర్థం లేని చిల్ల‌ర గొడ‌వ‌ల‌తో త‌గ‌వు ప‌డ్డ విష‌యం తెలిసిందే. దీంతో మొద‌టి రోజునే చాలామంది కంటెస్టెంట్లు బోరుమ‌ని ఏడ్చేశారు. అయితే రెండో రోజు మాత్రం కాస్త గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటూ వినోదాన్ని పంచే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఈసారి కూడా మోనాల్ ఏడుపును ఆప‌డం ఎవ‌రి త‌ర‌ము కాలేదు. అయితే అంద‌రి మ‌నుసుల‌ను తొలిచివేస్తున్న ప్ర‌శ్న‌ "క‌ట్ట‌ప్ప ఎవ‌రు?" ఈ ప్ర‌శ్న‌తోనే నేటి ఎపిసోడ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ స‌రైన‌ స‌మాధానం మాత్రం దొర‌క‌లేదు. ఈ రోజు షో ఎలా సాగిందంటే..

పిచ్చాసుప‌త్రిలాగా చేస్తున్న‌వ్
బిగ్‌బాస్ ఇంట్లో ఏర్పాటు చేసిన స్కూల్లో క‌రాటే క‌ల్యాణి టీచ‌ర్ పాత్ర‌లో లీన‌మైపోయింది అయితే 50 ఏళ్లుగా గంగ‌వ్వ ఇదే స్కూల్లో ఉంద‌ని టీచ‌ర్ పంచ్ వేస్తే.. జీతం తీసుకుని ఫెయిల్ చేస్తున్న‌వ్ అని అవ్వ రివ‌ర్స్ పంచ్ వేసింది. ఆమె అరుపుల‌తో స్కూలు కాస్తా పిచ్చాసుప‌త్రిలాగా చేస్తున్న‌వ్ అంది. గంగవ్వ మాట‌ల‌తో ఇంట్లో న‌వ్వులు పూశాయి. ఆ త‌ర్వాత‌ ప‌నిలో ప‌నిగా బిగ్‌బాస్ హౌస్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను కూడా కంటెస్టెంట్ల‌కు నేర్పించారు. మ‌రోవైపు రోజు గ‌డుస్తున్నా ఇంకా ప్ర‌త్యేక గ‌దిలోనే ఉన్నారు అరియానా, సోహైల్‌. మ‌ధ్యాహ్నం కావ‌స్తున్నా టిఫిన్‌, లంచ్ ఏదీ పంపించకుండా ప‌స్తులుంచుతున్నందుకు కంటెస్టెంట్ల తీరుపై అరియానాకు కోప‌మొచ్చింది. (చ‌ద‌వండి:బిగ్‌బాస్‌: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ)

"నిన్న ఆహారం పంపించారు. మ‌రి ఇవాళ పంపించాల‌న్న‌ ఆలోచ‌న లేదా?" అని అరియానా ఫోన్ చేసి అడిగింది. కాల్ వ‌స్తుంద‌నుకున్నాం అని అఖిల్ చెప్పగానే మెత్త‌బ‌డిన ఆమె "పొరుగింట్లో ఉన్న మాకోసం ఫుడ్ పంపించాలి క‌దా" అని వ‌య్యారాలు పోతూ అడిగింది. ఇలా స్వీట్‌గా మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ కూర పంపిస్తామ‌ని అఖిల్ చెప్పాడు. ఇలా తిండికోసం మాట్లాడుతుండ‌గా నోయ‌ల్ ఫోన్ అందుకుని ఏంది? మర్యాద‌గా అడిగితే మ‌ర్యాద‌గా పంపుతాం.. కానీ ఏంటిదంతా అంటూ పంపించ‌ట్లేదని చెప్ప‌క‌నే చెప్తూ ఫోన్ క‌ట్ చేశాడు. ఊహించ‌ని ప‌రిణామానికి అరియానా, సోహైల్ బిత్త‌ర మొహాలు వేసుకున్నారు.

అఖిలే క‌ట్ట‌ప్ప: గంగ‌వ్వ
ఇక క‌ట్ట‌ప్ప ఎవ‌రా అని బుర్ర‌లు బ‌ద్ధ‌లు చేసుకుంటున్న కంటెస్టెంట్ల‌కు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. మీ మ‌న‌సులో ఎవ‌రిని క‌ట్ట‌ప్పగా అనుకుంటున్నారో వారి పేర్ల‌ను రాసి ఓ డ‌బ్బాలో వేయ‌మ‌న్నాడు. అప్పుడు క‌రాటే క‌ల్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్, సూర్య కిర‌ణ్, సుజాత‌, గంగ‌వ్వ.. అఖిల్ పేరును, దేవి నాగ‌వ‌ల్లి, అఖిల్.. నోయ‌ల్‌, హారిక, లాస్య‌,‌.. సూర్య కిర‌ణ్‌, దివి, మెహ‌బూబ్‌.. లాస్య‌, అభిజిత్, మోనాల్‌‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, నోయ‌ల్‌.. మెహ‌బూబ్ పేర్ల‌ను రాశారు. ఇక‌ అఖిలే క‌ట్ట‌ప్ప అవుతాడ‌ని గంగ‌వ్వ ముఖం ప‌ట్టుకుని చెప్పేసింది. అంద‌రం అఖిల్‌ పేరే రాసిన‌మ‌ని అత‌నితోనే చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్స్‌..)

ఆక‌లితో అల‌మ‌టించిన ఆ ఇద్ద‌రు
ఈరోజు మొద‌టి ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ జ‌రిగింది. ఈ టాస్క్‌కు అమ్మ రాజ‌శేఖ‌ర్ సంచాల‌కులుగా వ్య‌వ‌హ‌రించాడు. అయితే టాస్క్ జ‌రుగుతున్న‌ప్పుడు ఎవ‌రూ ఏ త‌ప్పు చేయ‌కుండా చూడాల్సిన అమ్మ రాజ‌శేఖ‌ర్ వంటింట్లో దూరి ప‌ని చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. కంటెస్టెంట్లు అంద‌రూ చిత్ర‌లేఖ‌నంలో త‌మ ప్రావీణ్యాన్ని బ‌య‌ట‌కు తీశారు. అయిన‌ప్ప‌టికీ ఇంటి స‌భ్యులు కేవ‌లం 5 వేల పాయింట్లు మాత్ర‌మే సాధించుకున్నారు. ఇదిలా వుంటే పొరుగింటి వాళ్ల‌కు భోజనం పంప‌మ‌ని కంటెస్టెంట్లు స‌సేమీరా చెప్ప‌డంతో అరియానా, సోహైల్‌కు ఉప‌వాసం త‌ప్ప‌లేదు.

దీంతో ఆహారం ఎందుకు పంప‌లేదో మీరే ఆ ఇంటికి వెళ్లి తేల్చుకోండ‌ని బిగ్‌బాస్ సూచించాడు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు అస‌లు హౌస్‌లోకి ఈ ఇద్ద‌రు అడుగు పెట్టారు. అస‌లే ఆక‌లి మీదున్న వీళ్లు త‌మ‌కు జ‌రిగిన అ‌న్యాయంపై ఇత‌ర కంటెస్టెంట్లను క‌డిగి పారేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో అభిజిత్‌కు, సోహైల్‌కు పెద్ద గొడ‌వే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అస‌లు ఆ గొడ‌వ‌కు కార‌ణ‌మేంటి? ఇందులో ఎవ‌రిది త‌ప్పు? అనేది తెలియాలంటే రేప‌టివ‌ర‌కు వేచి చూడాల్సిందే! (చ‌ద‌వండి:బిగ్‌బాస్.. అనైతిక షో: నారాయ‌ణ‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-10-2020
Oct 28, 2020, 23:04 IST
బీబీ డే కేర్ బిగ్‌బాస్ హౌస్‌లోని కేర్‌టేక‌ర్ల‌కు మాత్ర‌మే కాదు, బ‌య‌ట ప్రేక్ష‌కుల‌కు కూడా విసుగును తెప్పించింది. దీంతో బిగ్‌బాస్‌...
28-10-2020
Oct 28, 2020, 18:17 IST
పిల్ల‌లు దైవస‌మానం అంటారు. కానీ పిల్ల‌ల్లా అవ‌తార‌మెత్తిన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రం రాక్ష‌సుల్లా మారిపోయి హౌస్‌లో అరాచ‌కం సృష్టిస్తున్నారు. కేర్...
28-10-2020
Oct 28, 2020, 17:16 IST
ఏ పాత్ర‌లోనైనా ఒదిగిపోయే హీరోయిన్ స‌మంత‌. అక్కినేని ఇంటి కోడ‌లిగా అడుగుపెట్టిన ఆమె పెళ్లి త‌ర్వాత విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ...
28-10-2020
Oct 28, 2020, 16:24 IST
నేనేమైనా బేకార్ గాడినా, నీతో కూర్చుని మాట్లాడ‌టం త‌ప్పితే నాకు వేరే ప‌నే లేదా? 
27-10-2020
Oct 27, 2020, 23:16 IST
బిగ్‌బాస్ ఇంట్లో చిన్న‌పిల్లలు ఉంటే ఎలాగుంటుంది అనేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు హౌస్‌మేట్స్‌. టాస్క్‌లో భాగంగా చిన్న‌పిల్ల‌ల్లా మారిపోయిన కంటెస్టెంట్లు...
27-10-2020
Oct 27, 2020, 20:00 IST
ఈ సీజ‌న్ క‌న్నా రెండో సీజ‌నే చాలా బెట‌ర్‌..
27-10-2020
Oct 27, 2020, 18:57 IST
గ‌తం గ‌త‌: అనే మాట‌ వినే ఉంటారు. ఇది దేనికైనా వ‌ర్తిస్తుందేమో కానీ బిగ్‌బాస్‌కు వ‌ర్తించ‌దు. ఎందుకంటే సీజ‌న్లు మారినా...
27-10-2020
Oct 27, 2020, 18:18 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభంలో హైద‌రాబాదీ మోడ‌ల్‌, న‌టి దివి వైద్య రేసుగుర్రంలో స్పంద‌న‌లా ఉండేది. త‌ర్వాత మార్నింగ్ మ‌స్తీలో...
27-10-2020
Oct 27, 2020, 16:44 IST
నామినేట్ చేయాల‌నుకున్న వ్య‌క్తితో ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలి త‌ప్ప వేరొక‌రిని మ‌ధ్య‌లోకి లాగ‌కూడ‌ద‌ని నాగార్జున ఇదివ‌ర‌కే వార్నింగ్ ఇచ్చారు....
27-10-2020
Oct 27, 2020, 16:17 IST
సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంటు దివి వైద్య‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందాన్ని కాపాడుకుంటూనే టాస్కుల్లో రాణించేయాల‌నే...
27-10-2020
Oct 27, 2020, 15:34 IST
నామినేష‌న్ అంటేనే గ‌డిచిన రోజుల్లోకి తొంగి చూస్తూ త‌ప్పొప్పుల‌ను ఎత్తి చూప‌డం. ఈ క్ర‌మంలో నిన్న జ‌రిగిన నామినేష‌న్ ప్రక్రి‌యలో...
26-10-2020
Oct 26, 2020, 23:24 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మోనాల్ ట్ర‌యాంగిల్ స్టోరీ బ‌య‌ట మాత్ర‌మే కాదు, హౌస్‌లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆరోవారం నామినేష‌న్‌లో మోనాల్...
26-10-2020
Oct 26, 2020, 19:34 IST
బిగ్‌బాస్ షోలో అత్యంత క‌ష్ట‌మైనది నామినేష‌న్ ప్రక్రియ‌. అప్ప‌టివ‌రకు అంద‌రితో న‌వ్వుతూ క‌లివిడిగా ఉన్న కంటెస్టెంట్లు నామినేష‌న్ వ‌చ్చేస‌రికి మాత్రం...
26-10-2020
Oct 26, 2020, 17:43 IST
టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున అక్కినేని బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న న‌టిస్తున్న‌ వైల్డ్‌డాగ్...
26-10-2020
Oct 26, 2020, 15:49 IST
స‌మంత వ‌చ్చిన వేళావిశేషం.. ఎలిమినేష‌న్ ఉండ‌దేమో అని కంటెస్టెంట్లు తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. కానీ వారి ఆశ‌ల‌ను నీరుగారుస్తూ దివి ఎలిమినేట్...
25-10-2020
Oct 25, 2020, 19:10 IST
న‌ట‌నా సామ్రాజ్య‌పు మ‌హారాణి, సిరివెన్నెల విర‌బోణి స‌మంత బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ద‌స‌రా స్పెష‌ల్ మ‌హా ఎపిసోడ్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌హ‌రించింది....
25-10-2020
Oct 25, 2020, 16:38 IST
డిటెక్టివ్‌గా వ‌చ్చిన‌ హైప‌ర్ ఆది, ఇక పంచులే పంచులు
25-10-2020
Oct 25, 2020, 15:41 IST
ద‌స‌రా కానుక‌గా ఈసారి ఎలిమినేష‌న్ ఉండ‌దు కాబోలు అనుకున్నారంతా! ఒక‌వేళ ఉన్నా మోనాల్ గ‌జ్జ‌ర్‌నే సానంపుతార‌ని ఫిక్స్ అయ్యారు. కానీ...
24-10-2020
Oct 24, 2020, 16:57 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో తొలిసారి హోస్ట్‌ లేకుండా ఈ శనివారం ఎపిసోడ్‌ జరగనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌...
23-10-2020
Oct 23, 2020, 23:14 IST
అఖిల్‌, అభిజిత్ బ‌ద్ధ శ‌త్రువులుగానే అంద‌రికీ తెలుసు. కానీ నేటి ఎపిసోడ్‌లో మాత్రం ఒక‌రి మీద ఒక‌రు జోకులు వేసుకోవ‌డంతో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top