శివ‌జ్యోతిని మించిపోయిన మోనాల్‌ | Bigg Boss 4 Telugu: Social Media Satires On Monal Gajjar For Crying | Sakshi
Sakshi News home page

శివ‌జ్యోతిని మించిపోయిన మోనాల్‌

Sep 9 2020 4:50 PM | Updated on Sep 9 2020 5:13 PM

Bigg Boss 4 Telugu: Social Media Satires On Monal Gajjar For Crying - Sakshi

బిగ్‌బాస్ అంటేనే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌కు సింగిల్ స్టాప్ అంటారు. అదేంటో కానీ ఈసారి సీజ‌న్‌లో మాత్రం ఎవ‌రిని క‌దిలించినా క‌న్నీళ్లే.. అస‌లు క‌దిలించ‌క‌పోయినా ఏడుపులు పెడ‌బొబ్బ‌లే. షో ప్రారంభ‌మైన నాటి నుంచి కొన‌సాగుతున్న ఈ అర్థం ప‌ర్థం లేని ఏడుపులను ప్రేక్ష‌కులు భ‌రించ‌లేక‌పోతున్నారు. ముఖ్యంగా మిస్ గుజ‌రాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్‌ అంద‌రినీ దాటి క‌న్నీటి కిరీటాన్ని అందుకునేలా ఉంది. మొద‌టి సీజ‌న్‌లో సింగ‌ర్ మ‌ధుప్రియ‌, రెండో సీజ‌న్‌లో దీప్తి సున‌య‌న‌, మూడో సీజ‌న్‌లో శివ‌జ్యోతి ఏడ‌వ‌టానికే వ‌చ్చార‌న్న‌ట్లుగా ప్ర‌తీదానికి ఏడుస్తూనే స‌మాధానం చెప్పేవాళ్లు. ఈసారి వారి స్థానాన్ని మోనాల్ గ‌జ్జ‌ర్ భ‌ర్తీ చేసింది. గొడ‌వ అయినా, కాక‌పోయినా రోజుకు ఒక్క‌సారైనా ఏడ‌వటం ప‌క్కా. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్ పులిహోర‌, నోయ‌ల్ ద‌మ్కీ)

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌రైన మొద‌టి రోజే త‌న కుటుంబం, తండ్రి గురించి చెప్తూ ఒక్క‌సారిగా ఏడ్చేసింది. రెండోరోజు వెజ్‌, నాన్‌వెజ్ సెప‌రేట్‌గా వండ‌మ‌ని కోర‌గానే, మ‌రో మాట చెప్ప‌కుండా అంద‌రూ ఓకే అన్నారు. అయినా స‌రే మ‌ళ్లీ ఏడుస్తూ చెప్పిందే చెప్పి అంద‌రికీ విసుగు తెప్పించింది. ఎప్పుడు చూసినా మోనాల్ ఏడుస్తూనే ఫుటేజీ ద‌క్కించుకుంటోంది. దీంతో పాతాళ‌గంగ బిరుదు సంపాదించుకున్న శివ‌జ్యోతిని మోనాల్ మించిపోయింద‌ని సోష‌ల్ మీడియాలో ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. పైగా హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండ‌టం కూడా ఆమెకు మైన‌స్ అవుతోంది. మున్ముందైనా ఆమె ఏడుపు కంట్రోల్ చేసుకుంటుందో, లేక‌ షో ఆసాంతం ఇలానే క‌న్నీళ్ల‌తో నెట్టుకొస్తుందో చూడాలి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌పై ఐపీఎల్‌ ఎఫెక్ట్‌!)

Advertisement
 
Advertisement
Advertisement