
బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో 14 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. అరియానా గ్లోరీ, సయ్యద్ సోహైల్‌ను మాత్రం ప్రత్యేక గదిలోకి పంపించారు. దీంతో నిన్నటి ఎపిసోడ్‌లో సోహైల్ ఫోన్‌లో తానే బిగ్‌బాస్ అని మాట్లాడుతూ ఇద్దరికీ అవసరమయ్యే వస్తువులను, తిండినీ లిస్టు చెప్పి త్వరగా పంపించాలని కంటెస్టెంట్లను ఆదేశించాడు. అతను చెప్పినవన్నీ ఇచ్చేందుకు సుజాత రెడీ అయింది. కానీ నోయల్‌కు మాత్రం ఎక్కడో తేడా కొట్టింది. మాట్లాడింది బిగ్‌బాస్ కాదని చెప్పాడు. ఇంతలోనే కల్యాణి, సుజాతకు చిన్న గొడవ జరగడంతో హౌస్ అంతా రసాభాసగా మారింది. ఇంత గొడవ జరిగినప్పటికీ సోహైల్ అడిగినవన్నీ ఏమాత్రం లోటు లేకుండా పంపించారు. ఇదేదో బాగుంది.. ఏ పనీ చేయకుండానే కూర్చున్న చోటే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తినొచ్చు అని అరియానా, సోహైల్ తెగ సంబరపడిపోయారు. (చదవండి: బిగ్‌బాస్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదు! )
కానీ నేటి ఎపిసోడ్‌లో నోయల్ వారి ఆనందాన్ని నీరు గార్చేసినట్లు తెలుస్తోంది. తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో.. అరియానా ఫోన్ చేసి పొరుగింటి నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పింది. ఫోన్ ఎత్తిన అఖిల్.. ఇంత స్వీట్‌గా మాట్లాడితే ఇంకొంచెం కూర ఎక్కువే పంపుతామని పులిహోర కలపడం మొదలుపెట్టాడు. ఇది సీరియస్ అని ఆమె చెప్పగానే నోయల్ ఫోన్ తీసుకుని 'ఏంది? నీ ప్రాబ్లమ్' అని దమ్కీ ఇచ్చాడు. మర్యాదగా అడుగుతేనే మర్యాదగా పంపుతామని తేల్చి చెప్పాడు. దీంతో బిత్తరపోయిన అరియానా కాస్త వినయాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడేది ఎవరా అని ఆరా తీసేందుకు పేరడిగింది. 'నా పేరు గూగుల్ చేస్కో' అని నోయల్ ఫోన్ కట్ చేయడంతో ఆమెకు దిమ్మ తిరిగిపోయింది. మరి ఈ స్పెషల్ గదిలో ఉన్న కంటెస్టెంట్లు ఇద్దరూ ఆకలితో అలమటిస్తారా? లేదా మళ్లీ ఫోన్ చేసి బతిమిలాడుకుంటారా? తిండి కోసం ఇతర కంటెస్టెంట్లు ముప్పుతిప్పలు పెట్టిస్తారా? అనేది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్-4 : హౌస్‌లోకి ఇద్దరు డైరెక్టర్స్!)
Separate housemates Iddariki manchi jhalak ichina #Noel 👌 👌 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/QyqPPvzfwz
— starmaa (@StarMaa) September 8, 2020