నామినేష‌న్స్ పిచ్చ లైట్‌: నోయ‌ల్‌

Bigg Boss 4 Telugu: Noel Wants To Leave Bigg Boss House - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో సెల‌బ్రిటీ కంటెస్టెంట్లు నోయ‌ల్‌, లాస్య‌. ఇద్ద‌రికీ మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ స్క్రీన్ స్పేస్‌ మాత్రం ల‌భించ‌ట్లేదు. లాస్య వంటింటి కుందేలుగా మారిపోగా, నోయ‌ల్ నీతి సూక్తులు చెప్తూ బాబా అవ‌తారం ఎత్తాడు. ఆట‌లో ఇర‌గ‌దీస్తాడనుకుంటే ఇలా మారిపోయాడేంట‌ని నోయ‌ల్ అభిమానులు డీలా ప‌డిపోయారు. నిజానికి షో ప్రారంభంలో కాస్త ఎగిరెగిరి ప‌డ్డాడు. క‌ట్ట‌ప్ప టాస్క్‌లో ఇత‌రుల‌ను నొప్పించ‌డం ఇష్టం లేదంటూ త‌న‌కు తానే క‌ట్ట‌ప్ప అని ప్ర‌క‌టించేసుకుంటూ న‌వ్వుల‌పాల‌య్యాడు. వేరే వ్య‌క్తి పేరు చెప్పాల‌ని బిగ్‌బాస్ హెచ్చ‌రించ‌డంతో మాస్ట‌ర్ ఫీల్ అవ‌డంటూ అత‌న్ని క‌ట్ట‌ప్ప‌గా పేర్కొన్నాడు. మొన్న‌టికి మొన్న‌ మాస్ట‌ర్‌నే నామినేట్ చేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ జంట ఫోటోలు మళ్లీ వైరల్‌!)

నిజ‌మైన నోయ‌ల్ ఎక్క‌డ‌?
ఈ మ‌ధ్య‌లో అత‌ను పెద్ద‌గా ఆట‌ను ర‌ఫ్ఫాడించిన‌ట్లు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అంద‌రూ మాస్కులు తీసేసినా నోయ‌ల్ మాత్రం ఇంకా మాస్కు పెట్టుకున్నాడ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అంతెందుకు, అత‌డు సేఫ్ గేమ్ ఆడుతున్నాడ‌ని, నిజ‌మైన నోయ‌ల్ క‌నిపించ‌డం లేద‌ని దివి కూడా ఆరోపించిన విష‌యం తెలిసిందే. అయితే సోమ‌వారం జ‌రిగిన‌ నామినేష‌న్స్‌లో అత‌న్ని టార్గెట్ చేయ‌డం‌పై నోయ‌ల్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు బిగ్‌బాస్ అన్‌సీన్ వీడియోలో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నామినేష‌న్స్ గురించి నోయ‌ల్ అభిజిత్‌తో మ‌న‌సు విప్పి మాట్లాడాడు. (చ‌ద‌వండి: చిన్న‌పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన సోహైల్‌)

మాస్ట‌ర్‌కు టార్గెట్ అయ్యాను
"నామినేష‌న్ పిచ్చ లైట్‌. ఒక్క ఓటు వ‌చ్చినా కూడా నామినేట్ అన్న‌ప్పుడు నోయ‌ల్ ముఖం మాడిపోయింది అని మాస్ట‌ర్ అంటున్నాడు. కానీ, నేను మెడిక‌ల్ రూమ్‌లోకి వెళ్లిన‌ప్పుడు నా కాల్ తీసుకోండి, ప్లీజ్ గంగ‌వ్వ‌ను పంపించిన‌ట్లు న‌న్ను పంపించండి అని కోరాను. నామినేషన్ ద్వారా వెళ్లినా, అలా నేరుగా వెళ్లినా ఒక్క‌టే. దానికి ఎందుకు ఫీల‌వుతాను. కానీ మాస్ట‌ర్ మంచిగా ఆలోచించ‌డం లేదు. మాస్ట‌ర్‌ను నామినేట్ చేసినందుకు టార్గెట్ అయ్యాను. దివి ఎందుకు న‌న్ను నామినేట్ చేసిందో కూడా తెలుసు" అని నోయ‌ల్ చెప్పుకొచ్చాడు. అయితే నోయ‌ల్ వ్యాఖ్యల‌పై ఆయ‌న అభిమానులు అస‌హ‌నానికి లోన‌వుతున్నారు. టాప్ 5లో నిల‌బెట్టేందుకు మేమంతా ప్ర‌య‌త్నిస్తుంటే గంగ‌వ్వ‌లా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తానంటాడేంటి? అని నిరుత్సాహ‌ప‌డుతున్నారు. (చ‌ద‌వండి: తెలుగు బిగ్‌బాస్‌లో ఆవేశం స్టార్లు ఎవ‌రో తెలుసా?)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top