బిగ్‌బాస్‌: సోహైల్‌పై నోరు జారిన అవినాష్‌

Bigg Boss 4 Telugu: Sohel Cried After Avinash Serious On Him - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో కోపిష్టి ఎవ‌రు అనగానే అంద‌రూ ముక్త‌కంఠంతో సోహైల్ పేరు చ‌టుక్కున చెప్పేస్తారు. అయితే అమ్మాయిల మీద అరిస్తే క‌థ వేరే ఉంట‌ద‌ని నాగ్ సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డంతో అత‌డు త‌న ప‌ద్ధ‌తి మార్చుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కోపాన్ని త‌గ్గించుకుంటాన‌ని నాగార్జున‌కు మాటిచ్చాడు. ఆ మాట నిల‌బెట్టుకోవ‌డం కోసం ఎంత గొడ‌వ జ‌రుగుతున్నా, ఎంత రెచ్చ‌గొడుతున్నా స‌హ‌నంతో మాట్లాడుతున్నాడే త‌ప్ప‌ మునుప‌టిలా న‌రాలు తెగేలా మాట్లాడ‌టం లేదు. పైగా కెప్టెన్‌గా విఫ‌ల‌మ‌య్యాడ‌న్న పేరు రాకుండా ఉండ‌టం కోసం నానా క‌ష్టాలు ప‌డుతున్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అన్నింటినీ త్యాగం చేసిన అభిజిత్‌)

ఇదిలా వుంటే బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల కోసం అమీతుమీ అనే టాస్క్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. నిన్న‌టి క‌న్నా క‌ఠిన‌త‌ర‌మైన టాస్కులు నేడు ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందులో భాగంగా అఖిల్‌కు గార్డెన్ ఏరియాలో షాంపుతో అభిజిత్ త‌ల‌స్నానం చేయిస్తున్నాడు. అయితే మోనాల్ వెంట‌నే బ‌కెట్ తెచ్చి నీళ్లు గుమ్మ‌రించ‌డంతో వ‌ద్ద‌ని వారించారు. అటు నోయ‌ల్ కూడా క‌ళ్ల‌లోకి షాంపూ వెళ్తుందేమోన‌ని అఖిల్ క‌ళ్లు తుడిచాడు. దీంతో అవినాష్ కోపానికి వ‌చ్చాడు. మీరు మంచోళ్లు, మేము చెడ్డోళ్లం కాదిక్క‌డ అని తిడుతూనే సంచాల‌కుడిని త‌ప్పుప‌ట్టాడు. సంచాల‌కుడిగా నువ్వు క‌రెక్ట్ కాద‌ని సోహైల్ ముఖం మీదే అనేశాడు. అక్క‌డితో ఆగ‌కుండా 'ఎవ‌రు బే ఆడుతుంది సేఫ్ గేమ్' అంటూ నోరు జారాడు. (చ‌ద‌వండి: అన్న‌య్య‌ ల‌వ‌ర్‌ను అక్కా అనేవాడిని: అవినాష్ త‌మ్ముడు)

ఒక‌రికి స‌పోర్ట్ చేసుకుంటూ ఇంకొక‌రికి చేయ‌క‌పోవ‌డం ఏంట‌ని నిల‌దీశాడు. అత‌ను అంటున్న ఒక్కో మాట‌కు అగ్నిగుండంలా ర‌గిలిపోతున్న సోహైల్ ధీటుగా స‌మాధానాలు ఇచ్చేవాడే, కానీ నాగ్‌కు ఇచ్చిన మాట కోసం సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే గొంతులో దిగ‌మింగుకుంటున్న కోపం, బాధ‌ను త‌గ్గించేందుకు అఖిల్ అత‌డిని ప‌క్క‌కు తీసుకువెళ్లాడు. ఏమీ చేయ‌లేక‌పోతున్న సోహైల్ ఒక్క‌సారిగా చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. త‌ప్పు లేకున్నా త‌న‌నే అంటున్నార‌ని తెగ‌ బాధ‌ప‌డ్డాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు సోహైల్ నవ్వ‌డం, కోప్ప‌డ‌టం చూశాం.. కానీ ఇంత‌లా రోదిస్తుండ‌టం మొద‌టిసారి చూస్తున్నామ‌ని అంటున్నారు. ఆయ‌న‌ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డాన్ని చూసి అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. అంద‌రూ అత‌న్ని కావాల‌నే రెచ్చ‌గొడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. (చ‌ద‌వండి: సుజాత ఎలిమినేట్‌, 'పోకిరీ'పై ప్ర‌తీకారం)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top