అన్న‌య్య‌ ల‌వ‌ర్‌ను అక్కా అనేవాడిని: అవినాష్ త‌మ్ముడు

Bigg Boss 4 Telugu: Mukku Avinash Breakup Love Story - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ అంద‌రినీ న‌వ్విస్తూ హౌస్‌లో బెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిలుస్తున్నాడు. అటు ప్రేక్ష‌కుల‌తో పాటు కంటెస్టెంట్ల‌ను కూడా మెప్పిస్తుండ‌టంతో క‌నీసం నామినేష‌న్‌లోకి కూడా రావ‌డం లేదు. కానీ అత‌డు ఇంట్లోకి వ‌చ్చాక హౌస్‌లోనే ఓ వెలుగు వ‌చ్చింద‌న్న‌ది నెటిజ‌న్ల అభిప్రాయం. అయితే అంద‌రినీ ఇంత‌లా న‌వ్వించే అవినాష్ జీవితంలోనూ ఎన్నో క‌ష్టాలున్నాయ‌ని అత‌డి ఎంట్రీ వీడియోలో చూపించారు. మరీ ముఖ్యంగా అవినాష్ ఓ అమ్మాయిని ప్రేమించ‌డం, చివ‌రాఖ‌ర‌కు ఆ ప్రేమ విఫ‌ల‌మ‌వ‌డాన్ని హైలైట్ చేశారు. అప్ప‌టినుంచి ఆ అమ్మాయి ఎవ‌రు? వాళ్ల‌ ప్రేమ ఎందుకు ముందుకు వెళ్ల‌లేదు? అని అవినాష్ అభిమానులు తెగ చించేస్తున్నారు. దీంతో అత‌డి బ్రేక‌ప్ స్టోరీ గురించి అవినాష్ త‌మ్ముడు అజ‌య్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. (అవినాష్ తిక్క కుదిర్చిన అరియానా)

ఆమె పిలిచి మ‌రీ డ‌బ్బులిచ్చేది
"మేం ముగ్గురం అన్న‌ద‌మ్ములం, హాస్ట‌ల్‌లో ఉండేవాళ్లం. అవినాష్‌ అన్న‌య్య టెన్త్‌లో ఉన్న‌ప్పుడు నేను ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాను. స్కూల్ డేస్‌లో అట్రాక్ష‌న్ ఉండేది. కాబ‌ట్టి అన్న‌య్య ఓ అమ్మాయిని ప్రేమించాడు, ఆమె చుట్టూ తిరిగేవాడు. స్కూల్‌కు వ‌చ్చినా కూడా ఆమెపైనే ఫోక‌స్ పెట్టేవాడు, ఆమె ఎక్క‌డ‌కు వెళ్తే అటు ఫాలో అయ్యేవాడు. అప్పుడు నేను మా అన్న దాగ్గ‌ర‌కు వెళ్లి రూపాయి ఇవ్వు మైసూర్ పాక్ కొనుక్కుంటా, రెండు రూపాలిస్తే సోనీ పాప‌డ్ కొనుక్కుంటా అని అడిగేవాడిని. వాడేమో లేవు పో, నేనివ్వ‌ను అనేవాడు. అప్పుడు ఆ అమ్మాయి న‌న్ను పిలిచి రూపాయి కావాలా అంటూ డ‌బ్బులిచ్చేది" (లాక్‌డౌన్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నుకున్నా)

అనుకోని కార‌ణాల వ‌ల్ల బ్రేక‌ప్ అయింది
"దీంతో ఏదైనా అవ‌స‌రం ఉంటే అన్న‌య్య ద‌గ్గ‌ర‌కు వెళ్లేవాడిని కాదు. అక్కా అక్కా అంటూ ఆమె ద‌గ్గ‌రకే వెళ్లి తీసుకునేవాడిని. అప్పుడు ఆ వ‌ర‌స‌లు తెలీక అక్కా అని పిలిచేవాడిని. త‌ర్వాత అన్న‌య్య చ‌దువైపోయింది. నేను ప‌దో త‌ర‌గ‌తికి వ‌చ్చాను, అప్పుడు తెలుసుకున్నా, ఆ అమ్మాయిని ల‌వ్ చేశాడ‌ని! కానీ ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. కానీ కొన్ని క‌రాణాల వ‌ల్ల బ్రేక‌ప్ అయింది. అయితే ఆ కార‌ణాలేంటో తెలీదు. బ్రేక‌ప్ త‌ర్వాత కెరీర్ మీద ఫోక‌స్ పెట్టాడు. మిమిక్రీ, స్టేజీ షోలు చేసేవాళ్లం. అన్న‌య్య టాలెంట్ చూసి ప్రిన్సిపాల్ కూడా బాగా ఎంక‌రేజ్ చేసేవారు. అలా ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చాడు. అత‌డిని ఈ సీజ‌న్ విజేత‌గా చూడాల‌నుకుంటున్నాను" అని అజ‌య్ చెప్పుకొచ్చాడు. (టాస్కులో ప‌డిపోయిన అవినాష్‌)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top