బిగ్‌బాస్‌: త‌ప్పెవ‌రిదో తేల్చ‌నున్న నాగ్ | Bigg Boss 4 Telugu: Nagarjuna To Solve Ariyana, Sohel Issue | Sakshi
Sakshi News home page

ఏడుస్తూ వుమెన్ కార్డు తీసుకొచ్చావు: నాగ్‌

Dec 12 2020 5:59 PM | Updated on Dec 12 2020 9:08 PM

Bigg Boss 4 Telugu: Nagarjuna To Solve Ariyana, Sohel Issue - Sakshi

పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌ల‌‌కు కూడా ఇష్ట‌మైన‌ కార్టూన్ 'టామ్ అండ్ జెర్రీ'. బిగ్‌బాస్ హౌస్‌లోని అరియానా, సోహైల్ బంధం కూడా ఇలాంటిదే. ట్ర‌యాంగిల్ స్టోరీ క‌న్నా ఈ రిలేష‌న్‌నే చాలామంది ఇష్ట‌ప‌డుతారు కూడా. ఈ రియ‌ల్‌ టామ్ అండ్ జెర్రీలు ఎప్పుడు క‌లిసుంటారో, ఎప్పుడు కొట్టుకుంటారో వీళ్ల‌కే తెలీదు. అలా చాలాసార్లు స‌ర‌దాగా గొడ‌వ ప‌డ్డ ఈ కంటెస్టెంట్లు ఎన్న‌డూ లేన‌ట్లుగా ఈ వారంలో తొలిసారి భీభ‌త్స‌మైన గొడ‌వ‌కు దిగారు. బ‌ద్ధ శ‌త్రువుల్లా కయ్యానికి కాలు దువ్వారు. కొట్టుకోవ‌డం ఒక్క‌టే త‌క్కువ అన్న‌ట్లుగా మాట‌ల యుద్ధానికి దిగారు. వీళ్ల ఉక్రోషాన్ని ఆప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాలేదు. ఆ ఘ‌ర్ష‌ణ జ‌రిగిన మ‌రుక్ష‌ణం నుంచి వీళ్ల మ‌ధ్య దూరం పెరిగింది. వాళ్ల మ‌న‌సుల్లోనూ అశాంతి మొద‌లైంది.  ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోకోవాల‌న్న వారి ప్ర‌య‌త్నం వృథా అయింది. (చేజేతులా నాశ‌నం చేసుకుంటున్న సోహైల్‌)

దీంతో ఇద్ద‌రూ నాగార్జున చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తూ భారంగా రోజులు వెళ్ల‌దీశారు. తీరా ఈ రోజు వాళ్ల గొడ‌వ‌కు ముగింపు ప‌లికే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగ్ వీళ్ల గొడ‌వ‌ను ప్ర‌స్తావించారు. ఇద్ద‌రి త‌ప్పుల‌ను ఎత్తి చూపారు. టాస్క్‌లో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు, కానీ జీవితంలో మాత్రం దాన్ని నియంత్రించుకోలేవా? అని సోహైల్‌ను నిందించారు. దీంతో అత‌డు స్పందిస్తూ హారిక చేసింది త‌ప్పైతే నువ్వు చేసిందేంటి? అని ఆమె నా ద‌గ్గ‌ర మూడో వ్య‌క్తి గురించి ప్ర‌స్తావించింది అంటూ అరియానా వైపు చేయి చూపించాడు. అత‌డి మాట‌లు విన్న త‌ర్వాత నాగ్.. "ముందుగా ఆవేశ‌ప‌డింది నువ్వు, మూడో వ్య‌క్తిని మొద‌ట తీసుకొచ్చింది నువ్వు, మ‌ళ్లీ ఏడ్చి వుమెన్ కార్డు తీసుకొచ్చావు' అంటూ అరియానాకు క్లాస్ పీకుతున్న‌ట్లుగా చూపించారు. బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రూ స‌మాన‌మే అని మ‌రోసారి కుండ బ‌ద్ధలు కొట్టారు. మ‌రి వీళ్ల‌ స‌మ‌స్య‌కు నాగ్ ఎటువంటి ప‌రిష్కారం చూపిస్తారనేది ఆస‌క్తిక‌రంగా మారింది. (అరియానాతో సినిమా తీస్తా: రామ్ గోపాల్ వ‌ర్మ‌)

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement