విజ‌యానికి దూర‌మ‌వుతున్న సోహైల్‌! | Bigg Boss 4 Telugu: Netizens Slam Sohel Over His Ugly Fight With Ariyana | Sakshi
Sakshi News home page

చేజేతులా నాశ‌నం చేసుకుంటున్న సోహైల్‌

Dec 10 2020 5:12 PM | Updated on Dec 10 2020 7:52 PM

Bigg Boss 4 Telugu: Netizens Slam Sohel Over His Ugly Fight With Ariyana - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌లో ఒక‌రు స‌య్య‌ద్ సోహైల్‌. అంద‌రిలాగా అత‌డు నేరుగా హౌస్‌లో అడుగు పెట్ట‌లేదు. అరియానాతో క‌లిసి రెండు రోజులు ఓ స్పెష‌ల్ గ‌దిలో ఉండి త‌ర్వాత ఇంట్లోకి స‌ర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా మొద‌ట్లోనే వీళ్లిద్ద‌రికీ బిగ్‌బాస్ ముడిపెట్టాడు. కానీ మిగ‌తా జంట‌ల్లా వీరు క‌లిసి ఉండ‌లేరు, అలా అని దూరంగానూ ఉండ‌లేరు. ఓవైపు తిట్టుకుంటూనే మ‌రోవైపు ఫ్రెండ్ అంటూ చేతులు క‌లుపుతారు. దీంతో వీళ్ల‌కు టామ్ అండ్ జెర్రీ అన్న ట్యాగ్ కూడా వ‌చ్చేసింది. అయితే సోహైల్ మొద‌ట్లో టెంప‌ర్ లూజై నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేవాడు. కోపంలో ఏం మాట్లాడుతున్నాడో అత‌డికి కూడా తెలిసేది కాదు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : ఫినాలేకు అతిథిగా స్టార్‌ హీరో!)

సోహైల్‌కు మైన‌స్‌గా మారుతోన్న గొడ‌వ‌
కానీ ఎప్పుడైతే త‌న కోప‌మే త‌న శ‌త్రువు అని గ్ర‌హించి, నాగార్జున‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం కోపాన్ని జ‌యించాడో అప్ప‌టినుంచి కొత్త సోహైల్ క‌నిపించాడు. న‌వ్వుతూ, ఇత‌రుల‌ను న‌వ్విస్తూ, అంద‌రినీ క‌లుపుకుపోతూ స‌రదాగా ఉండేవాడు. స్నేహం కోసం ఏదైనా చేసే ఎమోష‌న‌ల్ ఫూల్ ఇత‌డు. అందుకే ఫినాలే మెడ‌ల్‌ను అఖిల్‌కు త్యాగం చేశాడు. ఇన్ని సుగుణాలున్న సోహైల్‌ను కోప‌మ‌నే విష వృక్షం అత‌డిని కింద‌కు లాగుతోంది. టైటిల్ కొట్ట‌డానికి ఇంకా ప‌ది రోజులే ఉన్న త‌రుణంలో అతడు అరియానాతో గొడ‌వ‌పెట్టుకోవ‌డం మొద‌టికే మోసం తెచ్చేలా ఉంది. ఒక అమ్మాయి మీద‌కు అలా దూసుకువెళ్లి మాట్లాడ‌టాన్ని చాలామంది త‌ప్పుప‌డుతున్నారు. అరియానా క‌రెక్ట్ పాయింట్స్ మాట్లాడితే.. అత‌డు మాత్రం గ‌తాన్ని త‌వ్వి ఆమెను బ్యాడ్ చేయాల‌ని చూస్తున్నాడ‌ని నిందిస్తున్నారు. మోనాల్ కోసం ఆమెను నిందించ‌డం, అవినాష్ విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌డం ముమ్మాటికీ త‌ప్పేన‌ని విమ‌ర్శిస్తున్నారు.  (చ‌ద‌వండి: హారిక‌కు సోహైల్ వార్నింగ్‌: క‌థే వేరే ఉందిగా!)

త‌న గొయ్యి త‌నే తీసుకుంటున్న సోహైల్‌
అమ్మాయిలను గౌర‌వించాల‌న్న నాగ్ మాట‌ను నిన్న‌టి ఎపిసోడ్‌లో సోహైల్ పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడు. అటు అరియానా త‌న‌ను త‌ప్పుగా నిరూపించాల‌నుకున్న సోహైల్‌కు ఎదురు తిరిగి చివ‌రి వ‌ర‌కు అత‌డితో పోరాడింది. కానీ త‌న‌ను కావాల‌ని టార్గెట్ చేయ‌డం త‌ట్టుకోలేక‌పోయిన అరియానా నేను బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ మాత్ర‌మే చేశాను. నాకు మ‌న‌సు లేక‌పోతే ఇక్క‌డి వ‌ర‌కు ఎందుకొస్తాను అంటూ ఒక్క‌సారిగా ఏడ్చేసింది. ఆమెను ఓదార్చ‌డం ఇంట్లో ఎవ‌రి త‌ర‌మూ కాలేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వీరి ఫైట్ గురించే చ‌ర్చ న‌డుస్తోంది. మెజారిటీ నెటిజ‌న్లు అరియానాను వెన‌కేసుకురాగా సోహైల్‌దే త‌ప్ప‌ని నిందిస్తున్నారు. మాట‌లు జారుతున్న అబ్బాయితో చివ‌రి వ‌ర‌కు పోట్లాడిన అరియానాను ప్ర‌శంసిస్తున్నారు. మ‌రి ఈ గొడ‌వ‌పై నాగార్జున ఎలా స్పందిస్తారో! మొత్తానికి సోహైల్ తన అగ్రెసివ్ బిహేవియ‌ర్‌తో  త‌న గోతి త‌నే తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఉన్న కొద్ది రోజులైనా పాత‌వి త‌వ్వ‌కుండా త‌న గేమ్ త‌ను ఆడితే టాప్ 2లో ఉండ‌గ‌ల‌డు. ఇలా లేని పోని గొడ‌వ‌లు పెట్టుకుంటే మాత్రం చేజేతులా విజ‌యాన్ని నాశ‌నం చేసుకున్న‌ట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement