బిగ్‌బాస్‌ : ఫినాలేకు అతిథిగా స్టార్‌ హీరో!

Bigg Boss 4 Telugu : Star Hero To Be The Chief Guest For Grand Finale - Sakshi

ఏన్నో ఊహగానాల మధ్య మొదలైన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌.. చూస్తుండగానే ముగింపు దశకు చేరింది. కరోనా వల్ల ఈ సారి బిగ్‌బాస్‌ షో ఉంటుందా లేదా అనే అనుమానాల మధ్య షో అట్టహాసంగా ప్రారంభమై అట్ట‌హాసంగా ప్రారంభ‌మై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచింది. షోలో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపించడంతో మొదట్లో కాస్త నెగెటివ్‌ టాక్‌ వినిపించినా.. రానురాను షోని ఆసక్తికరంగా మలిచి అందరి కళ్లు బిగ్‌బాస్‌ హౌస్‌పై పడేలా చేశారు నిర్వాహకులు. ముఖ్యంగా షో ఎండింగ్‌ వచ్చిన నేపథ్యంలో ఆట మరింత రసవత్తరంగా మారింది. కంటెస్టెంట్ల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఫైనల్స్‌లో నిలిచేందుకు ఎవరి ఆట వాళ్లు చాలా క్లెవర్‌గా ఆడుతున్నారు. ఇంట్లో అంతా కలిసిమెలిసి ఉన్నప్పటికీ గేమ్‌లో మాత్రం వ్యక్తిగతంగా పోరాడుతూ.. ఫైనల్‌కు వెళ్లేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.
(చదవండి : బిగ్‌బాస్‌: అందుకే అఖిల్‌ ఏడ్చాడా?)

 హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు విజేత అవుతారా అంటే మాత్రం రకరకాలు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరి మించి ఒకరు గేమ్‌ గట్టిగా ఆడుతున్నారు. అందుకే బిగ్‌బాస్‌ విజేత ఒకరని చెప్పడం కష్టంగా మారింది. ఇక నాల్గో సీజన్‌ ఎండింగ్‌కి కొద్ది రోజలు(డిసెంబర్‌ 20న ఫినాలే జరుగుతుందని అంచనా)మాత్రమే ఉండడంతో  షోని గ్రాండ్‌గా కంక్లూడ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట నిర్వాహకులు. ఎప్పటి మాదిరే ఈ సారి కూడా ఫైనల్‌కి ఓ స్టార్‌ హీరోని గెస్ట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. 
(చదవండి : బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లానా అనిపించింది: నోయ‌ల్‌)

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఫినాలేకు మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా వచ్చి మెగా ఫినిషింగ్‌ ఇచ్చాడు. అంతకు ముందు రెండో సీజన్‌కు విక్టరీ వెంకటేష్‌ వచ్చి గ్రాండ్‌ ఎండింగ్‌ ఇచ్చాడు. అయితే  ఈ సారి గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  తెలుగులో బిగ్‌బాస్ ప్రారంభమైన తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సారి ఫినాలేకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు లేదా అల్లు అర్జున్‌ వస్తే బాగుంటుందని బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ఫినాలేకు చైతన్య వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే చైతూ భార్య సమంత, తమ్ముడు అఖిల్‌ సందడి చేశారు. దీపావళి స్పెషల్‌ గెస్ట్‌గా చైతన్య వస్తారని ఆశించారు. కానీ అది కుదరలేదు. దీంతో ఫినాలేకు చైతన్య, సాయి పల్లవి కలిసి వస్తారని మరో టాక్‌ వినిపిస్తోంది. మరి ఫినాలేకు గెస్ట్‌గా ఏ స్టార్‌ వచ్చి సందడి చేస్తాడో చూడాలి మరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top