బిగ్‌బాస్‌ : పిల్లలెలా పుడతారు.. నాగ్‌ ఫన్నీ ఆన్సర్‌ | Bigg Boss 4 Telugu: Nagarjuna Funny Answer On How Children Are Born | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : పిల్లలెలా పుడతారు.. నాగ్‌ ఫన్నీ ఆన్సర్‌

Dec 13 2020 4:35 PM | Updated on Dec 13 2020 9:52 PM

Bigg Boss 4 Telugu: Nagarjuna Funny Answer On How Children Are Born - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ బిగ్‌ రియాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. ఎన్నో అనుమానాల మధ్య మొదలైన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌.. మొదట్లో కాస్త చప్పగా సాగింది. హౌస్‌లో ఎక్కువ మంది కొత్త ముఖాలే ఉండటంతో షో చూడడానికి  ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు. ఇలాంటి తరుణంగా షోను విజయవంతం చేసే బాధ్యతను హోస్ట్‌ నాగార్జున తన భుజాల పైన వేసుకున్నాడు. మొదట్లో కేవలం నాగార్జున కోసం మాత్రమే షో చూశారనడంతో అతిశయోక్తి లేదు. వచ్చేది వారానికి రెండు రోజులే అయినా.. వారం మొత్తం ఆ రెండు ఎపిసోడ్లను గుర్తు పెట్టుకునేలా తనదైన ముద్ర వేసి వేళ్లేవాడు.  ఇంటి సభ్యుల తప్పులకు కోపంతో కాకుండా నవ్వుతో చెబుతూ వచ్చాడు.

అలాగే తనదైన శైలీలో ఇంటి సభ్యులపై పంచ్‌లేస్తూ శని, ఆదివారాలను ఫన్‌డేలుగా మార్చేస్తున్నాడు. షో ముగింపుకు వచ్చిన నాగ్‌ పంచ్‌, జోకులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం నాగార్జున చెప్పి ఫన్నీ అన్సర్‌ ఒకటి ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. గత మూడు రోజుల క్రితం టాస్క్‌లో భాగంగా మోనాల్‌ని అభిజిత్‌ కొన్ని నాటీ ప్రశ్నలు అడిగి ఆమెను తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె ఏకాగ్రతను దెబ్బతీసేందుకై.. ‘పిల్లలు ఎలా పుడతారు మోనల్?’ అని అభిజిత్‌ అడిగాడు. అతడు ఈ ప్రశ్న అడగగానే సోహెల్, అరియానా ఆశ్చర్యపోయారు. అరియానా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ప్రశ్న మోనల్‌ మాత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘‘అమ్మ హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ డాక్టర్ హెల్ప్ చేస్తారు. అదొక గిఫ్ట్’’ అని మోనల్ సమాధానం ఇచ్చింది. ఆ రోజు ఆ ప్రశ్నే హైలెట్‌గా నిలిచింది.

ఇక ఇదే ప్రశ్నను మరోసారి ఇంటిసభ్యుల ముందుకు తెచ్చాడు నాగార్జున. శనివారం ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్కులు ఇచ్చిన నాగ్‌... పిల్ల‌లెలా పుడ‌తారు? అని అభిజిత్‌ అడిగిన ప్ర‌శ్న‌ను తిరిగి అత‌డికే సంధించారు. దీంతో కంగుతిన్న అభి.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆశ్చర్యంతో నిలబడిపోవడంతో,నాగ్.. ఏడుస్తూ పుడ‌తారు అని ఫన్నీగా ఆన్సర్‌ ఇచ్చాడు. నాగ్‌ జవాబుకు హౌస్‌మేట్స్‌ అంతా పగలబడి నవ్వారు. 

Advertisement
 
Advertisement
Advertisement