నువ్వేం త‌క్కువ కాదు: దివిపై సోహైల్ ఫైర్‌

Bigg Boss 4 Telugu: Monal Gives Back Hug To Noel Shocked Abhijeet - Sakshi

అంద‌రూ దొంగ‌లే:  సోహైల్ ఫైర్‌

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో ఈ మ‌ధ్యే జ‌రిగిన ఫిజిక‌ల్ టాస్క్ నుంచి ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌ప‌డిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ఆ మ‌ధ్య త‌న‌కు అనిపించింద‌ని చెప్పినందుకు లాస్య విల‌న్ అవ‌గా అప్ప‌టినుంచి సైలెంట్ అయిపోయింది. అభిజిత్‌, అఖిల్ ఇద్ద‌రితో క‌లివిడిగా తిరిగే మోనాల్ ఇప్పుడు అఖిల్‌ను మాత్రమే అంటిపెట్టుకొని ఉంటోంది. అటు హారిక‌తో క్లోజ్‌గా ఉండే అభి కొత్త‌గా వ‌చ్చిన స్వాతి దీక్షిత్‌తోనే ఎక్కువ స‌మ‌యం ఉంటూ దేత్త‌డిని ప‌క్కన పెట్టేశాడు. మాస్ట‌ర్ అంద‌రినీ త‌న మాయ‌మాట‌ల‌తో న‌మ్మిస్తూ నేటి టాస్క్‌లో బాగానే బురిడీ కొట్టించాడు. నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

ఓట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని మెహ‌బూబ్‌
మార్నింగ్ మ‌స్తీలో సోహైల్ దొంగ‌త‌నాలు నేర్పించాడు. త‌ర్వాత టాస్క్ కోసం నాగ్ న‌న్ను మెచ్చుకున్నారంటే న‌న్ను మెచ్చుకున్నాడ‌ని అభిజిత్‌, సోహైల్ చిన్న‌పిల్ల‌ల్లా మాట‌ల యుద్ధానికి దిగారు. 'కోప‌మొస్తే రేప్పొద్దున న‌న్ను కొట్టినా కొట్టేస్త‌వ్' అని అభి అంటే లేద‌ని సోహైల్ స‌మాధాన‌మిచ్చాడు. కానీ నువ్వు మామూలోడివి కావు, మ‌గాడిలా ఆడ‌ని సోహైల్ స‌ల‌హా ఇచ్చాడు. కండ‌లు వాడేస్తే మ‌గాడివైత‌వా? బ్రెయిన్ కూడా వాడ‌ని అభి తిరిగి కౌంట‌ర్ ఇచ్చాడు. దీంతో కోపం న‌షాళానికంటిన సోహైల్‌ అమ్మాయిల‌ను పెట్టుకుని ఆడ‌త‌వు, మ‌గాడిలా ఆడు అని చిర్రుబుర్రులాడాడు. దీంతో అన‌వ‌స‌రంగా కోపానికి రాకు అని అఖిల్‌ సోహైల్‌ను ఊర‌డించాడు. ఆ త‌ర్వాత అభిజిత్‌, మెహబూబ్ సైతం మ‌ళ్లీ అదే టాస్క్ గురించి గొడ‌వ ప‌డ్డారు. 'మా మ‌నుషుల టీమ్ ఓడిపోవ‌డానికి కార‌ణం నువ్వు కాబ‌ట్టి నిన్ను నామినేట్ చేశా'న‌ని మెహ‌బూబ్ చెప్ప‌డంతో ఓటమిని జీర్జించుకోలేక‌పోతున్నార‌ని చెప్ప‌క‌నే తెలుస్తోంది.

అభి, కుమార్ ద‌గ్గ‌ర కాయిన్లు కొట్టేసిన దివి
అనంత‌రం బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవ‌రిద‌గ్గ‌ర ఎక్కువ కాయిన్స్ ఉంటే వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయ‌ని తెలిపాడు. ఆట మొద‌ల‌వ‌గానే ఇంటి స‌భ్యులంద‌రూ పోటాపోటీగా కాయిన్స్ సేక‌రించారు. అయితే మోనాల్‌, అఖిల్ క‌లిసి ఆడారు. అటు స్వాతి కూడా త‌న కాయిన్స్ అభికి ఇచ్చేస్తా అంది. అభి, కుమార్ దాచుకున్న కాయిన్ల‌ను దివి ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా ఎత్తుకుపోయింది. దీంతో త‌న‌వి తాను తీసుకుంటానని వ‌చ్చిన‌ కుమార్‌ను మాస్ట‌ర్ అడ్డుకుని దివికి స‌పోర్ట్ చేశాడు. సోహైల్ అంద‌‌రివీ కొట్టేస్తున్నాడని ఎవ‌రో అన‌డంతో గేమ్ గేమ్‌లా ఆడండ‌ని అంద‌రి మీదా విరుచుకుప‌డ్డాడు. త‌న‌ను దొంగ అంటూ ఏదో చెప్పబోయిన దివిని కూడా నువ్వేం త‌క్కువ కాదు, కుమార్ ద‌గ్గ‌ర బాగానే కొట్టేశావ్ అని చుర‌క‌లంటించాడు. (చ‌ద‌వండి: చెర‌సాల‌లో చెత్త‌గా ఆడిన నోయల్!)

ఆవేశంతో అరిచి, ఆపై సారీ చెప్పిన సోహైల్‌
త‌ర్వాత సుజాత కూడా సోహైల్‌ఫై ఫైర్ అవ‌డంతో అంద‌రూ దొంగ‌లే, నేను ఆడ‌ను, మీరే ఆడుకోండి అని ఆవేశంతో ఊగిపోయాడు. కానీ ఆ వెంట‌నే సుజాత‌కు సారీ చెప్పాడు. దివికి మాత్రం చెప్ప‌న‌న్నాడు. ఎందుకంటే ఆమె త‌న‌ను దొంగ అన‌డం న‌చ్చ‌లేద‌ని వాపోయాడు. త‌ర్వాత అంద‌రి ద‌గ్గ‌రా మంచిత‌నాన్ని న‌టిస్తున్న మాస్ట‌ర్ అరియానా కాయిన్ల‌ను లేపేశాడు. ఆ విష‌యం తెలీని ఆవిడ నేరుగా మాస్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌న గోడు వెల్ల‌బోసుకుంది. కానీ మాస్ట‌ర్ మాత్రం తీసింది తానేన‌ని కాసేప‌టి వ‌ర‌కు చెప్ప‌నేలేదు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ హౌస్‌లో త‌ల‌నొప్పిగా మారుతోన్న గంగ‌వ్వ‌!)

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ వార్నింగ్‌
పైగా అయ్యో, నేనిస్తాలేన‌ని అతిగా న‌టిస్తూ బాగానే బురిడీ కొట్టించాడు. త‌ర్వాత మోనాల్.. నోయ‌ల్‌ను వెన‌క నుంచి హ‌గ్ చేసుకుని తినిపించ‌డంతో ప‌క్క‌నే ఉన్న అభి ముఖం కోపంతో మాడిపోయింది. త‌ర్వాతి టాస్కులు ఎలా ఉంటాయో అని స్వాతి అంటుంటే కూడా ఆ కోపం నుంచి బ‌య‌ట‌కు రాలేక‌ ఆలోచించాల‌నిపించ‌డం లేద‌ని చెప్పుకొచ్చాడు. కాగా ఎవ‌రి ఆట వాళ్లే ఆడాల‌ని బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రేపు జంటలు, గ్రూపులుగా కాకుండా ఒక్కొక్క‌రే రంగంలోకి దిగుతారేమో చూడాలి. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: హౌస్‌లో అవినాష్ బ‌ర్త్‌డే వేడుక‌లు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-12-2020
Dec 04, 2020, 22:56 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా తనను ఎంచుకోండని అభిజిత్‌ బిగ్‌బాస్‌ను వేడుకున్నాడు. తాను గత వారం ఓ తప్పు చేశానని,...
04-12-2020
Dec 04, 2020, 19:47 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ...
04-12-2020
Dec 04, 2020, 18:17 IST
ఏన్నో ఊహగానాల మధ్య మొదలైన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌.. చూస్తుండగానే ముగింపు దశకు చేరింది. కరోనా వల్ల ఈ సారి...
04-12-2020
Dec 04, 2020, 17:02 IST
'టికెట్ టు ఫినాలే' రేస్‌ మూడో లెవ‌ల్‌లో ఇద్దరు ప్రాణ స్నేహితులు అఖిల్‌, సోహైల్‌ వెళ్లడంతో ఆట రంజుగా మారింది....
03-12-2020
Dec 03, 2020, 23:15 IST
కెట్ టు ఫినాలే రేసు నేడు మూడో లెవ‌ల్‌లోకి అడుగుపెట్టింది. ఈసారి బిగ్‌బాస్‌ ఫిజిక‌ల్ టాస్కు లాంటివి కాకుండా స‌హ‌నానికి,...
03-12-2020
Dec 03, 2020, 20:40 IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అనారోగ్య కార‌ణాల‌తో నోయ‌ల్‌ షో మ‌ధ్య‌లో నుంచే వెళ్లిపోయాడు. ఆ మ‌ధ్య‌ త‌న రీఎంట్రీ ఉంటుంద‌ని...
03-12-2020
Dec 03, 2020, 19:32 IST
బిగ్‌బాస్ ఆడే ఆట‌లో కంటెస్టెంట్లు పావులు మాత్ర‌మే. వీళ్లు బంధాలు, స్నేహాలు అంటూ ఒక‌రినొక‌రు ఎంత అల్లుకుపోయినా బిగ్‌బాస్ మాత్రం...
03-12-2020
Dec 03, 2020, 17:46 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఫిజిక‌ల్‌గా స్ట్రాంగ్ ఎవ‌రు? అన‌గానే మొద‌ట మెహ‌బూబ్‌, అఖిల్ పేర్లే వినిపిస్తాయి. మెహ‌బూబ్ ఎలాగో వెళ్లిపోయాడు...
03-12-2020
Dec 03, 2020, 15:36 IST
బిగ్‌బాస్ షో ముగింపుకు వ‌స్తున్నా మోనాల్ వ్య‌వ‌హారం మాత్రం ఎవరికీ ఓ ప‌ట్టాన అర్థం కావ‌డం లేదు. మొద‌ట అభిజిత్‌తో,...
02-12-2020
Dec 02, 2020, 23:19 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఫినాలే రేస్ న‌డుస్తోంది. ఏడుగురితో మొద‌లైన ఈ పోటీ ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య‌నే జ‌ర‌గ‌నుంది. అంద‌రినీ దాటుకుని...
02-12-2020
Dec 02, 2020, 20:51 IST
ఎక్క‌డ చూసినా బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ విజేత ఎవ‌ర‌నేదానిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. టాప్ 5లో ఉండేదెవ‌రు? టాప్ 2లో నిలిచేదెవ‌రు?...
02-12-2020
Dec 02, 2020, 17:45 IST
క‌ద‌లిరండి, మీ విలువైన ఓటు హ‌క్కును వినియోగించుకోండి.. అని ప్ర‌భుత్వ యంత్రాంగం, ఎన్నిక‌ల క‌మిష‌న్ నెత్తీనోరూ మొత్తుకుంది. అయినా స‌రే హైద‌రాబాదీలు...
02-12-2020
Dec 02, 2020, 16:40 IST
అమ్మాయిలు ఆకాశంలో స‌గం అంటారు. ఇంటి మహా ల‌క్ష్మి అని కీర్తిస్తారు. అన్ని రంగాల్లో పురుషుల‌తో స‌మానమేన‌ని చెప్తారు. కానీ...
02-12-2020
Dec 02, 2020, 15:40 IST
నామినేష‌న్లు అనే అడ్డంకులే లేకుండా నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. అందుకే కంటెస్టెంట్లు బిగ్‌బాస్ ప్ర‌వేశ‌పెట్టిన టికెట్...
01-12-2020
Dec 01, 2020, 23:19 IST
బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్ప‌టిదాకా ఒక లెక్క‌, ఇప్పుడొక లెక్క అన్న‌ట్లుగా త‌మ బుద్ధిబ‌లానికి, శ‌క్తిసామ‌ర్థ్యాల‌కు...
01-12-2020
Dec 01, 2020, 18:35 IST
పంతొమ్మిది కంటెస్టెంట్ల‌తో మొద‌లైన బిగ్‌బాస్ ప్ర‌యాణం ఇప్పుడు ఏడుగురి ద‌గ్గ‌ర ఉంది. వీరిలో ఒక‌రికి నేరుగా ఫినాలేలో పాగా వేసేందుకు...
01-12-2020
Dec 01, 2020, 16:21 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు శుభం కార్డు వేసేందుకు ముచ్చ‌ట‌గా మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ స‌మ‌యంలో బిగ్‌బాస్...
01-12-2020
Dec 01, 2020, 15:39 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం తుది అంకానికి చేరుకుంటోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మాత్ర‌మే మిగిలారు. వీరిలో ఒక‌రు టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్...
30-11-2020
Nov 30, 2020, 23:22 IST
ఈసారి బిగ్‌బాస్ ఇంటిస‌భ్యుల‌కు కావాల్సిన‌న్ని గొడ‌వ‌లు పెట్టుకునేందుకు బంప‌రాఫ‌ర్ ఇచ్చాడు. ఇద్ద‌రి క‌న్నా ఎక్కువ మందిని కూడా నామినేట్ చేసుకోవ‌చ్చని...
30-11-2020
Nov 30, 2020, 20:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అంద‌రిలో ఆస‌క్తి రేకెత్తించిన ట్ర‌యాంగిల్ స్టోరీ ఎన్నో మ‌లుపులు తిరుగుతూ ఉంది. మోనాల్ కోసం కొట్టుకు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top