బిగ్‌బాస్ హౌస్‌లో త‌ల‌నొప్పిగా మారుతోన్న గంగ‌వ్వ‌!

Bigg Boss 4 Telugu: Housemates Unable To Play Game For This Reason - Sakshi

"బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రూ స‌మాన‌మే". గ‌త మూడు సీజ‌న్ల నుంచి వ‌స్తున్న ఈ నియ‌మాన్ని ఈ సీజ‌న్‌లో గాలికొదిలేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అర‌వ‌య్యేళ్ల వ‌య‌సున్న గంగ‌వ్వ బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్ట‌డం విశేష‌మే. ఆమె వ‌య‌సును గౌర‌వించి తీరాల్సిందే. ఆమెపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించాల్సిందే. కానీ ఫిజిక‌ల్ టాస్కులో అదే ఆట‌కు అడ్డుప‌డుతోంది. నిన్నటి ఉక్కు హృ‌ద‌యం టాస్క్‌లో బిగ్‌బాస్‌ ఇంటి స‌భ్యుల‌ను మ‌నుషులు, రోబోలుగా విడ‌గొట్టారు. గంగ‌వ్వ రోబోల టీమ్‌లో ఉంది. ఆమె ఉన్నందుకు మ‌నుషుల టీమ్ అడుగు ముందుకు వేయ‌డానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. దీంతో గంగ‌వ్వ వ‌ల్ల ఇత‌ర కంటెస్టెంట్ల ఆట‌తీరు దెబ్బ తింటోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి

అవ్వ‌ను బాగానే వాడుకున్న రోబోలు
మ‌రోవైపు 'అవ్వ ఉంది, జాగ్ర‌త్త'‌ అంటూ రోబోలు ఆమెను అడ్డుపెట్టుకుని బాగానే ఆడారు. కిడ్నాప్ ప్లాన్‌కు కూడా ఆమెను వాడుకున్నారు. ఈ క్ర‌మంలో గంగ‌వ్వ అమ్మాయిల‌ను ట్రాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించింది. ఇక్క‌డేదో తిర‌కాసు ఉంద‌ని అనుమానించిన మ‌నుషులు వారి కోపాన్ని అణుచుకుని మ‌రీ అవ్వ‌తో బుజ్జ‌గింపుగా మాట్లాడారు. కానీ తెలిసిందే క‌దా, ఆమె ఎవ‌రి మాటా ప‌ట్టించుకోదు. ఆ త‌ర్వాత దివిని కిడ్నాప్ చేయ‌డం, ఆవేశంతో మ‌నుషులు రెచ్చిపోవ‌డం రెండూ జ‌రిగాయి. దీంతో మ‌నుషుల‌పై గ‌రం అయిన అవ్వ క‌నీసం వారు ఏం చెప్తున్నారో కూడా వినే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. (చ‌ద‌వండి: భీభ‌త్సంగా వ‌ర్క‌వుట్ అయిన కిడ్నాప్ ప్లాన్‌)

మోనాల్‌పై చేయి చేసుకున్న అవ్వ‌!
ఇక‌ నేడు రిలీజ్ చేసిన ప్రోమో‌లోనూ అవ్వ మోనాల్‌పై చేయి చేసుకున్న‌ట్లు అస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. నిజానికి అదే స్థానంలో వేరే ఎవ‌రు ఉన్నా అక్క‌డ ప‌రిస్థితి ఇంకోలా మారిపోయేదే. కానీ అవ్వ‌ను ఎవ‌రూ ప్ర‌శ్నించే సాహ‌సం చేయ‌రు. ఒక‌వేళ‌ చేసినా.. వారిని దోషులుగా చూస్తారు పైగా లోప‌ల నుంచి హారిక‌.. అవ్వ జోలికి ఎవ‌రూ పోవ‌ద్ద‌ని చెప్ప‌డం మ‌రింత హాస్యాస్పదం. ఆమె కూడా ఆట‌లో భాగ‌మైన‌ప్పుడు గొడ‌వ స‌హ‌జం. అయితే మిగ‌తా కంటెస్టెంట్లు ఒక‌రి మీద ప‌డి మ‌రొక‌రు కొట్టుకుంటూ, తోసుకుంటున్నా, అవ్వ‌కు ఏం అవుతుందోన‌న్న భ‌యంతో ఆమెను ట‌చ్ చేయ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు.

టాస్క్‌లో అవ్వ‌ను ప‌క్క‌కు త‌ప్పించండి
ఆమె ఉన్న చోట‌కు వెళ్లేందుకు కూడా వెన‌క‌డుగు వేస్తున్నారు. ఆవేశంలో అరిచినందుకే సోహైల్‌, మోనాల్‌పై తీవ్రంగా విరుచుకుప‌డుతున్న వాళ్లు అవ్వ ఏకంగా ఓ అమ్మాయిపై కుర్చీ పైకెత్తి విసిరేసినా కిమ్మ‌న‌కుండా ఉండ‌టం శోచ‌నీయం. దీంతో ఆమెను ఫిజిక‌ల్ టాస్క్‌లో ప‌క్క‌న పెట్టండి అని కొంద‌రు సూచిస్తున్నారు. కానీ రానున్న కాలంలో మ‌రింత క‌ఠినంగా మార‌నున్న‌ ఈ ఫిజిక‌ల్ టాస్కుల్లో ఓ కంటెస్టెంట్‌గా‌ ఆమెను ప‌క్క‌న పెట్టడం జ‌ర‌గ‌ని ప‌ని. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఏడుగురిలో ఇంటికెళ్లేది ఎవరు?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top