అభిజిత్ ల‌వ్ స్టోరీ చెప్పండి: నాగ్‌

Bigg Boss 4 Telugu: Monal Gajjar Mom Says She Likes Abhijeet - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఓ ర‌కంగా అదృష్ట‌వంతులు. క‌రోనా దూర‌ని కుటీరంలా బిగ్‌బాస్ హౌస్ వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది. అయితే ఆ మాయ‌దారి రోగం వ‌ల్ల కంటెస్టెంట్లకు వారి కుటుంబాల‌కు మ‌ధ్య గాజు తెర అడ్డుగా నిలిచింది. కానీ అది వారి ప్రేమ‌ను అడ్డుకోలేదు. క‌న్న‌వారిని క‌ళ్లారా చూసుకుని ఇంటి స‌భ్యులు భావోద్వేగానికి లోన‌య్యారు. మంచీచెడ్డ‌లు అడిగి తెలుసుకున్నారు. 70 రోజుల‌కు పైగా ఇంట్లో ఉంటున్న కంటెస్టెంట్ల‌కు ర‌క్త‌సంబంధీకుల‌తో ఎంత మాట్లాడినా త‌నివి తీర‌లేదు. అందుక‌ని నాగార్జున ఇంటిస‌భ్యుల కోసం నేడు మ‌రోసారి వారి కుటుంబాల‌ను తీసుకువ‌చ్చారు. అఖిల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన బుడ్డోడు త‌న‌కు అఖిల్ బాబాయ్‌తో పాటు మోనాల్ కూడా ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అఖిల్‌కి హ్యాండిచ్చిన మోనాల్‌)

ఇక మోనాల్ అమ్మ త‌న కూతురు త‌ర్వాత అభిజిత్ ఇష్ట‌మ‌ని చెప్ప‌డంతో అఖిల్ ముఖం మాడిపోయింది. ఆవేశాన్ని ఆప‌గ‌లం కానీ అభిమానాన్ని ఆప‌లేమ‌ని అరియానా సోద‌రి పంచ్ వేసింది. రాత్రి తొమ్మిది త‌ర్వాత సోహైల్ క‌థ వేరే ఉంట‌ద‌ని అత‌డి ఫ్యామిలీ మెంబ‌ర్ ఏదో ర‌హ‌స్యాన్ని చెప్ప‌బోతుంటే వ‌ద్ద‌ని సోహైల్ వేడుకున్నాడు. ఇక‌ అభిజిత్ ల‌వ్ స్టోరీ గురించి చెప్ప‌మ‌ని నాగ్‌ అత‌డి బంధువును అడ‌గ్గా.. నాన్న ముందు చెప్తే బాగోద‌ని అభి దాట‌వేసే ప్ర‌య‌త్నం చేశాడు. త‌ర్వాత అవినాష్ నాగ్ అడిగిన ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో అత‌డి ఫ్యామిలీ మెంబ‌ర్‌ను క‌లుసుకునే అవ‌కాశం కోల్పోయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక ఈ ప్రోమోను చూసిన నెటిజ‌న్లు అఖిల్‌కు పంచ్ ప‌డింద‌ని కామెంట్లు చేస్తున్నారు. మోనాల్ సోద‌రి అభికి కౌంట‌రిస్తే వాళ్ల అమ్మ మాత్రం అత‌డికే స‌పోర్ట్ చేయ‌డం విశేషమ‌ని చెప్తున్నారు. (చ‌ద‌వండి: ఐ హేట్ యూ అన్నావు, అస‌లు న‌న్నో ఫ్రెండ్‌గా ఎప్పుడు ఇష్ట‌ప‌డ్డావు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top