బిగ్‌బాస్‌: ట్రోలింగ్‌పై స్పందించిన మెహ‌బూబ్‌

Bigg Boss 4 Telugu: Mehboob Dil Se About Bigg Boss Journey - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభ‌మైన తొలినాళ్ల‌లో మెహ‌బూబ్‌కు అంత‌గా స్క్రీన్ స్పేస్ దొర‌క‌లేదు. త‌ర్వాత త‌ర్వాత నెమ్మ‌దిగా పుంజుకున్న అత‌డు టాస్కుల్లో త‌న స‌త్తా చూపి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అయితే ఆవేశంలో నోరు జార‌డం, రోబో టాస్కులో అతిగా ఆవేశ‌ప‌డ‌టం, కోపంలో నోరు జార‌డం, కేవ‌లం ఫిజిక‌ల్ టాస్కుల మీద మాత్ర‌మే దృష్టి పెట్ట‌డ‌మే అత‌న్ని ఎలిమినేష‌న్ దిశ‌గా న‌డిపించాయి. దీంతో ప‌దోవారంలో ఇంటి స‌భ్యుల‌ను ఏడిపిస్తూ హౌస్ నుంచి భారంగా వీడ్కోలు తీసుకున్నాడు. బ‌య‌టకు వ‌చ్చాక అత‌డు అభిజిత్‌, సోహైల్‌కు త‌న పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నాడు. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు అఖిల్ నీ ఫ్రెండే క‌దా అత‌డికి ఎందుకు స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై మెహ‌బూబ్ స్పందిస్తూ అత‌డు నామినేష‌న్‌లో లేడ‌ని, నామినేష‌న్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌డికి కూడా స‌పోర్ట్ చేస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు. అలాగే త‌న బిగ్‌బాస్ జ‌ర్నీ గురించి ప్ర‌త్యేక వీడియోను త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పోస్ట్ చేశాడు. 

ప‌ది వారాలు ట్రోల్ చేశారు
మెహ‌బూబ్ త‌న‌పై జ‌రిగిన‌ ట్రోలింగ్‌పై స్పందిస్తూ.. 'బ‌య‌ట అప్ప‌టికే నాకో ఫేమ్ ఉంది. అయితే అది టిక్‌టాక్ వ‌ల్లే వ‌చ్చింది. అందుకే బిగ్‌బాస్ ఛాన్స్ వ‌చ్చింది అని చాలామంది అనుకున్నారు. అందుకే ట్రోల్ చేశారు. ఒక్క‌వారం కూడా ఉండ‌న‌ని అన్న‌వాళ్లు కూడా ఉన్నారు. కాక‌పోతే వాళ్ల‌కు నేను ఎలా ఉంటానో తెలీదు. కాబ‌ట్టి అక్క‌డికి వెళ్లాక న‌న్ను చూసి వీళ్ల అభిప్రాయం మారుతుంది అనుకున్నా. అయినా స‌రే ప‌ది వారాల దాకా నామీద ట్రోలింగ్ ఆగ‌లేదు. నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా స‌పోర్ట్ చేయ‌లేదు. నన్ను స‌పోర్ట్ చేస్తే వాళ్ల‌ను ఎక్క‌డ ట్రోల్ చేస్తారో అని! కేవ‌లం నా కుటుంబం, ప్రేక్ష‌కుల వ‌ల్లే ఇన్నివారాలు లోప‌ల ఉన్నా. చివ‌రికి నేను ఎలిమినేట్ అవుతుంటే, నేను లోప‌ల ఉండాల్సిన వ్య‌క్తిని అని అంతా అంటున్నారు, అది సంతోషంగా ఉంది. మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా ట్రోల్ జ‌రుగుతుంది' అని తేలిక‌గా తీసిపారేశారు. (చ‌ద‌వండి: మెహ‌బూబ్ గుడ్‌బై: అవినాష్‌పై బిగ్‌బాంబ్‌)

ముందు నా గురువును క‌లుస్తా
ఫిమేల్ కంటెస్టెంట్ల‌లో ఎవ‌రిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవ‌రిని చంపుతారు? అన్న ప్ర‌శ్న‌కు దివితో పెళ్లి, హారిక‌తో డేటింగ్‌, అరియానాను చంపేస్తాన‌ని మొహ‌మాటం లేకుండా చెప్పాడు. ముందుగా ఈ సీజ‌న్ నుంచి ఇదివ‌ర‌కే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల‌లో మొట్ట మొద‌ట‌గా త‌న గురువు అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను క‌లుస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇచ్చిన టాస్కుల్లో త‌న‌కు విల‌న్ పాత్ర బాగా ఇష్ట‌మ‌‌ని చెప్పాడు. హౌస్‌లో అఖిల్-మోనాల్‌, అభిజిత్-హారిక‌, సోహైల్-మెహ‌బూబ్‌, అవినాష్-అరియానా జంట‌లు బాగుంటాయ‌ని తెలిపాడు. (చ‌ద‌వండి: హారిక‌ను ఓ చోట‌కు తీసుకెళ్తా: అభిజిత్)

అరియానా బోల్డ్, కానీ ఇన్నోసెంట్ అమ్మాయి
కంటెస్టెంట్ల గురించి చెప్తూ.. "అభిజిత్ నాకు పెద్ద‌న్న‌లా ఉండేవాడు. భుజం స‌మస్య ఉంది కాబ‌ట్టి స‌రిగా ఫిజిక‌ల్ టాస్కులు ఆడ‌లేక‌పోయాడు. కానీ ఇప్పుడు మాత్రం టాస్కుల్లో అల్లాడిస్తున్నాడు. క‌చ్చితంగా టాప్ ‌3లో ఉంటాడు. అఖిల్ కొన్ని విష‌యాల్లో ఎమోష‌న‌ల్ అయిపోతున్నాడు. కాస్త కోపం ఎక్కువ‌. కానీ బాగా ఆడతాడు. మోనాల్ గేమ్ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతోంది. అవినాష్ అంద‌ర్నీ ఎంట‌ర్‌టైన్ చేస్తాడు. బంధాల‌కు విలువిస్తాడు. అరియానాకు ఆరోగ్యం బాగోలేన‌ప్పుడు ఆమెను బాగా చూసుకున్నాడు. అరియానా.. నిజంగా బోల్డ్‌. లోప‌ల మాత్రం ఇన్నోసెంట్ గ‌ర్ల్‌. లాస్య అక్క చాలా మంచిది. టాస్కుల్లో మాత్రం కొంచెం త‌గ్గుతోంది. అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. షో కోసం మ‌న‌మేం చేయ‌గ‌లం అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. మాస్ట‌ర్ చాలా మంచి వ్య‌క్తి. గంగ‌వ్వ‌.. ఫైట‌ర్‌. దివి నా బెస్ట్ ఫ్రెండ్‌, చాలా అందంగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. సోహైల్.. దిల్‌దార్ ఉంటాడు. వాడు టాప్ 3లో ఉండాలి. హారిక‌.. ఫైట‌ర్‌. టాస్కుల్లో అబ్బాయిల‌తో స‌మానంగా ఆడుతుంది" అని పేర్కొన్నాడు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top