Bigg Boss 4 Telugu Contestant Akhil Sarthak Bought A New Car - Sakshi
Sakshi News home page

పాతికేళ్లకే సాధించిన అఖిల్‌ సార్థక్‌

Feb 22 2021 6:30 PM | Updated on Feb 22 2021 7:37 PM

Bigg Boss 4 Telugu: Akhil Sarthak Buys New Car - Sakshi

గెలుపు ఒక్కటే విజయం కాదు, డబ్బుతో వెలకట్టలేని అభిమానాన్ని సంపాదించడమూ ఓ రకంగా విజయమే. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ రన్నర్‌ అఖిల్‌ సార్థక్‌ ఈ మాటను బలంగా విశ్వసిస్తాడు. అందుకే హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ విన్నర్‌ రుబీనాకు కాకుండా రన్నర్‌గా నిలిచిన రాహుల్‌ వైద్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. రన్నర్లు కూడా విన్నర్లే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే తాజాగా అఖిల్‌ సార్థక్‌ ఓ కొత్త కారు కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

"పాతికేళ్లలోపే కొత్త కారు కొనాలని నాకు నేను ప్రామిస్‌ చేసుకున్నాను. తల్లిదండ్రుల సపోర్ట్‌, నా హార్డ్‌వర్క్‌, మీ ప్రేమాభిమానాల వల్లే ఇప్పుడా కల నెరవేరింది. నేను కష్టాన్ని నమ్ముతాను, పనిని దైవంగా భావిస్తాను. ఏదైనా సరే సాధించేవరకు పోరాడుతూనే ఉంటాను. అఖిల్‌ ఫ్యామిలీలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జై శ్రీరామ్‌.." అంటూ అఖిల్‌ ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చాడు. త్వరలోనే హోండా సిటీ కారులో రైడ్‌కు వెళ్దాం అని సోహైల్‌, నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మోనాల్‌ సదరు పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. నోయల్‌ సహా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తన ఎర్రటి కారులో ఎరుపు రంగు డ్రెస్సులో అఖిల్‌ నేడు షికారుకు వెళ్లాడు. ఈ వీడియోను ఆర్‌జే చైతూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ అఖిల్‌కు కంగ్రాట్స్‌ చెప్పుకొచ్చాడు. మరి ఈ కారులో సామ్‌(సోహెల్‌, అఖిల్‌, మోనాల్‌ గజ్జర్‌) ఎప్పుడు షికారుకు వెళ్తారోనని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇదిలా వుంటే అఖిల్‌ ప్రస్తుతం "తెలుగు అబ్బాయి- గుజరాత్‌ అమ్మాయి" అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్‌ ముద్దుగుమ్మ మోనాల్‌ గజ్జర్‌ అతడితో జోడీ కడుతోంది.

చదవండి: జంటగా మారబోతున్న బిగ్‌బాస్‌ ఫేం మోనాల్‌-అఖిల్‌

Advertisement
 
Advertisement
Advertisement