ప్యాంటులో మాస్క్ పెట్టుకుంటావా?: స‌ల్మాన్ ఫైర్‌

Bigg Boss 14: Salman Khan Shames Nikki Tamboli Hiding Mask In Pants - Sakshi

ద‌క్షిణాది హీరోయిన్ నిక్కీ తంబోలికి హిందీ బిగ్‌బాస్ నుంచి పిలుపు రావ‌డంతో అక్క‌డ వాలిపోయింది. తానింకా సింగిల్ అని చెప్తూ బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌నే బుట్ట‌లో వేసే ప్ర‌య‌త్నం చేసింది. ఇదిలా ఉంటే సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఆమె చేసిన ప‌నికి స‌భ్య స‌మాజం త‌ల‌దించుకుంది. ఆమె విప‌రీత చేష్ట‌లు చూసి జ‌నాలు ఛీ కొట్టారు. ఇంత‌కీ ఆమె ఏం చేసిందంటారా? న‌వంబ‌ర్ 3న ప్ర‌సార‌మైన ఎపిసోడ్‌లో ఓ టాస్కు జ‌రిగింది. అందులో నిక్కీ.. త‌న ప్ర‌త్య‌ర్థి రాహుల్‌కు మాస్క్ ద‌క్క‌కూడ‌ద‌ని ఏకంగా త‌న ప్యాంటులో మాస్క్‌ను దాచిపెట్టుకుంది. దీంతో షాకైన రాహుల్ ఆమె నుంచి మాస్కు తీసుకోవ‌డం అసాధ్యం కాబ‌ట్టి టాస్కు వ‌దిలేశాడు. దీంతో అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌కు నెటిజన్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ వేదిక వదిలి వెళుతున్న సల్మాన్‌ ఖాన్‌!)

ఇక నీచంగా ప్ర‌వ‌ర్తించిన నిక్కీని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌ త‌ర్వాత నిక్కీ రాహుల్ వైద్య‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ అత‌డు మాత్రం  కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పాడు. నువ్వు చేసిన ప‌ని చాలా దారుణ‌మ‌ని, నీ ముఖం చూస్తేనే రోత పుడుతుంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. కాగా ఈ మాస్క్ వివాదంలో నిక్కీ తంబోలీ చ‌ర్య‌ను స‌ల్మాన్ ఖాన్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. నువ్వు మాస్క్ ఎక్క‌డ పెట్టుకున్నావు? అక్క‌డ ఎవ‌రైనా చేయి పెట్టి తీసుకుంటే నీ ప‌రిస్థితి ఏమ‌య్యేది? అని అడ‌గ్గా.. కావాల‌ని చేయ‌లేదు, తొంద‌ర్లో అలా జ‌రిగిపోయింది అని జ‌వాబిచ్చింది. త‌ను చేసిన త‌ప్పుకు రాహుల్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. ఇక ఆ స‌మ‌యంలో స‌హ‌నంతో ప్ర‌వ‌ర్తించిన రాహుల్ మీద స‌ల్మాన్ ప్ర‌శంస‌లు కురిపించారు. కాగా నిక్కీ తంబోలి చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు సినిమాతో పాటు కాంచ‌న 3, తిప్ప‌రా మీసం చిత్రాల్లో న‌టించారు. (చ‌ద‌వండి: దీపావళి కానుకగా వన్‌గ్రామ్‌ గోల్డ్, బట్టలు ఇచ్చిన హీరో)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top