
ఈ వారం హిందీ బిగ్‌బాస్ 14 చాలా వేడి వేడిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్‌ఖాన్ వేదికను వదిలి వెళ్లిపోతున్న ప్రోమోను బిగ్‌బాస్ టీం విడుదల చేసింది. ఈ ప్రోమోలో కవిత, ఈజాజ్ ఖాన్‌పై విరుచుకుపడింది. లాక్‌డౌన్ సమయంలో అతనికి వండిపెట్టానని, అతను తన స్నేహితుడు కాదు అంటూ ఏది పడితే అది మాట్లాడింది. వ్యక్తిగత విషయాల దగ్గరకు వెళ్లి దూషణలు మొదలు పెట్టింది.
సల్మాన్ మధ్యలో కలుగజేసుకొని సర్థి చెప్పే ప్రయత్నం చేసిన కవిత వినకుండా తన మాటల దాడి చేస్తూనే ఉంది. దీంతో సల్మాన్‌కు చిరాకు రావడంతో మీరే కొట్టుకోండి అంటూ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోతున్నాడు.
కవిత హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు ఈజాజ్ చాలా సంతోషపడ్డాడు. పరిశ్రమలో తనకున్న కొద్దిమంది స్నేహితులలో కవిత ఒకరు అని చెప్పాడు. ఈ విషయాన్ని కవిత కూడా అంగీకరించింది. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో విబేధాలు తలెత్తడంతో ఈజాజ్ తనకు అసలు స్నేహితుడే కాడంటూ అతనిపై నిందలు మోపుతోంది. ఈ ప్రోమోను కలర్స్ టీవీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ, సల్మాన్ స్టేజ్ దిగి వెళ్లిపోతున్నాడు ఇంకా ఏం జరుగుతాయో ఈ షోలో చూడండి అంటూ పోస్ట్ చేసింది.