భీమ్లా నాయక్: పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో బెదిరించిన రానా | Bheemla Nayak: Rana As Daniel Shekar Out Now | Sakshi
Sakshi News home page

Bheemla Nayak: డానియల్‌ శేఖర్‌గా రానా.. పంచెకట్టులో పవర్‌ఫుల్‌గా

Sep 20 2021 7:01 PM | Updated on Sep 20 2021 8:06 PM

Bheemla Nayak: Rana As Daniel Shekar Out Now - Sakshi

Rana Daggubati As Daniel Shekar From Bheemla Nayak : పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చేసింది. రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. 

ఇందులో రానా డేనియల్‌ శేఖర్‌ పాత్రలో నటిస్తున్నారు. పంచెకట్టులో కనపించిన రానా లుక్‌ అదిరిపోయింది.  'నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర..హీరో' అంటూ రానా పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన  పవన్‌ కల్యాణ్‌ లుక్‌ విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమావచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement