భీమ్లా నాయక్‌: అంత ఇష్టం ఏందయ్యా సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

Bheemla Nayak: Pawan Kalyan And Nitya Menon Antha Ishtam Song Promo Release - Sakshi

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి  సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు, ఫస్ట్‌ సింగిల్‌ ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్‌కు జోడిగా నిత్యామీనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు.

చెప్పినట్టుగానే రేపు సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్‌. ఈ నేపథ్యంలో ఈ రోజు(అక్టోబర్‌ 14) ఈ పాటకు సంబంధించిన ప్రోమో వదిలారు. ఈ సందర్భంగా రేపు ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాటను ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్‌ చిత్ర ఆలపించారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా..  రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top