భీమ్లా నాయక్‌ సెకండ్‌ సింగిల్‌, ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది | Pawan Kalyan Bheemla Nayak Second Single Full Song Release | Sakshi
Sakshi News home page

Bheemla Nayak Second Single: ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Oct 15 2021 11:12 AM | Updated on Oct 15 2021 11:21 AM

Pawan Kalyan Bheemla Nayak Second Single Full Song Release - Sakshi

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి  సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు, ఫస్ట్‌ సింగిల్‌ ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్‌కు జోడిగా నిత్యామీనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఓ పాటను దసరా కానుకగా పవన్‌ ఫ్యాన్‌ కోసం విడుదల చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగా చిత్రం బృందం నిన్న సాంగ్‌ ప్రోమో వదిలి శుక్రవారం(అక్టోబర్‌ 15)న పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు. 

‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాట సీని ప్రియులకు బాగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ గేయ రచయిత  రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను సింగర్‌ చిత్ర ఆలపించారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా..  రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement