తెలుగులో రిలీజ్‌ కాబోతున్న మరో కన్నడ బ్లాక్‌ బస్టర్‌ మూవీ! | bhairathi ranagal Movie Ready To Release In Telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో రిలీజ్‌ కాబోతున్న మరో కన్నడ బ్లాక్‌ బస్టర్‌ మూవీ!

Nov 16 2024 3:30 PM | Updated on Nov 16 2024 3:30 PM

bhairathi ranagal  Movie Ready To Release In Telugu

ఈ మధ్యకాలంలో కన్నడ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్‌ అవుతున్నాయి. అయితే కొన్ని అక్కడ రిలీజ్‌ అయిన రోజే ఇక్కడ రిలీజ్‌ చేస్తున్నారు. మరికొన్ని మాత్రం అక్కడ సూపర్‌ హిట్‌ అయితేనే కొంత సమయం తీసుకొని తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా మరో కన్నడ బ్లాక్‌ బస్టర్‌ మూవీ కూడా తెలుగులో రిలీజ్‌ కావడానికి రెడీ అవుతుంది. అదే  భైరతి రణగల్‌.  

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం కర్ణాటకలో రిలీజ్‌ అయి హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది.  ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. సూపర్ హిట్ మూవీ "మఫ్తీ"కి ప్రీక్వెల్ గా టాలెంటెడ్ డైరెక్టర్ నర్తన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. గీతా పిక్చర్స్ బ్యానర్ పై గీతా శివరాజ్ కుమార్ భైరతి రణగల్ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంతోషంలో శివరాజ్ కుమార్ అభిమానులు సినిమాలోని ఆయన మేకోవర్ తో థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. "భైరతి రణగల్" చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో రాహుల్ బోస్, నానా పటేకర్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగి బాబు, దేవరాజ్ నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement