ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్? | Bhagavanth Kesari OTT Release Date And Platform Details | Sakshi
Sakshi News home page

Bhagavanth Kesari OTT: శ్రీలీల కొత్త మూవీ.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

Published Fri, Nov 10 2023 9:25 PM | Last Updated on Sat, Nov 11 2023 10:46 AM

Bhagavanth Kesari OTT Release Date Details Sreeleela - Sakshi

బాలకృష్ణ, శ్రీలీల నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. వసూళ్లు బాగానే తెచ్చుకుంది గానీ ఓవరాల్‌గా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని సీన్లు బాగానే ఉన్నప్పటికీ ప్రేక్షకులని అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. అలాంటిది ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయిందట.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ ఐదు స్పెషల్!)

'భగవంత్ కేసరి'లో బాలకృష్ణతో పాటు శ్రీలీల కీలక పాత్ర చేసింది. యాక్టింగ్‌తో పాటు క్లైమాక్స్‌లో ఫైట్స్ కూడా చేసిన శ్రీలీల, అందరూ అవాక్కయ్యేలా చేసింది. దసరా సందర్భంగా రిలీజ్ కావడం వల్లనో ఏమో గానీ ఈ చిత్రాన్ని కలెక్షన్స్ అయితే రూ.100 కోట్లకు పైనే వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

ఇకపోతే థియేటర్లలో సినిమా విడుదల కావడానికి ముందే 'భగవంత్ కేసరి' డిజిటల్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. అక్టోబరు 19న ఈ మూవీ థియేటర్లలోకి రాగా.. ఐదు వారాల తర్వాత అంటే నవంబరు 23న 'భగవంత్ కేసరి' చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అనుకుంటున్నారట. దీనిపై అధికారికంగా ప్రకటన రానప్పటికీ దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ అని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement