ప్రిన్స్‌ యావర్‌తో లవ్‌? క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్‌ బ్యూటీ | Sakshi
Sakshi News home page

Nayani Pavani: ప్రిన్స్‌ యావర్‌తో నయని లవ్‌లో ఉందా?

Published Wed, Feb 21 2024 9:54 PM

BB Fame Nayani Pavani Clarifies Love Rumors with Prince Yawar - Sakshi

బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటే పాపులారిటీ ఎంతొస్తుందో.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కంటెస్టెంట్లను ట్రోల్‌ చేస్తుంటారు. అయితే ఇలాంటి షోలో ఎటువంటి నెగెటివిటీ లేకుండా బయటకు రావడం చాలా కష్టం. కానీ బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో ఫుల్‌ పాజిటివిటీతో బయటకు వచ్చింది నయని పావని. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన ఈమె ఒక్క వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది.

షో నుంచి బయటకు వచ్చాక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ప్రిన్స్‌ యావర్‌తో తరచూ రీల్స్‌, డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ వస్తోంది. ఇది చూసిన జనాలు.. వీళ్ల మధ్య ఏదో ఉందని అనుమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఆమె అభిమానులతో చిట్‌చాట్‌ చేయగా ఓ వ్యక్తి నువ్వు ప్రిన్స్‌ యావర్‌తో ప్రేమలో ఉన్నావా? అని అడిగేశాడు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయిన నయని.. అరేయ్‌, ఏంట్రా మీరు? ఇంకో ప్రశ్నే లేదా? మా మధ్య ఏం లేదు అని ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి అని రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది.

చదవండి: ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ లేట్‌గా ప్లాన్‌ చేశా.. రెండోది త్వరలోనే..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement