
ఎలైట్ టాకీస్ పతాకంపై కే.భాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం బాటిల్. 'తంగలాన్' ఫేమ్ అన్భుడన్ అర్జున్, 'గాంధీ కణక్కు' చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్ వద్ద కోడైరెక్టర్‌గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్‌కాంత్, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్‌గా నటించిన దిహాన్, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఆరు పాటలు
దర్శకుడు నారాయణన్ మాట్లాడుతూ.. ఒక ర్యాప్ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్ శిష్యుడు యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బాటిల్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
చదవండి: ఓటీటీలో హృతిక్ స్టార్మ్