నటి హేమకు బెయిలు మంజూరు | Bangalore Court Issued Bail To Actress Hema In Rave Party Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Bangalore Rave Party: నటి హేమకు బెయిలు మంజూరు..

Published Thu, Jun 13 2024 6:44 AM | Last Updated on Thu, Jun 13 2024 12:52 PM

Bangalore Court Bail Issued To Actress Hema

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో నటి హేమకు తాజాగా బెయిల్‌ లభించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరు నగర శివార్లలో జరిగిన రేవ్‌పార్టీలో హేమ  మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు విచారించారు. ఈ క్రమంలో హేమకు  స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని  కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement