Bandla Ganesh: తండ్రి మాట వినకుండా బన్నీలా బాగుపడండి..

Bandla Ganesh Comments On Allu Brothers, Video Goes Viral - Sakshi

వివాదాలతో సావాసం చేసే సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. తాజాగా అల్లు ఫ్యామిలీ మీద ఆయన చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లో పాల్గొన్న బండ్ల గణేశ్‌ అల్లు బాబీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ.. 'అందరికీ చెప్తున్నా, తండ్రి మాట వినొద్దు. తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే మా బాబీగారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తే బన్నీగారిలా అవుతారు. బాబీగారిలా అవ్వాలా? బన్నీగారిలా అవ్వాలా? అనేది మీరే నిర్ణయించుకోండి' అన్నాడు.

'బాబీ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుని మామూలుగా ఇలా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటూ పోయిన బన్నీ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. దయచేసి తండ్రి మాట వినొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోండి. తండ్రి మాట విన్న బాబీని చూడండి, వినని బన్నీని చూడండి' అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బాబీ పాజిటివ్‌గా తీసుకుని సరదాగా నవ్వాడు.

ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతుంగా నెటిజన్లు బండ్ల గణేశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పబ్లిక్‌లో ఏది పడితే అది వాగేయడమేనా? కాస్తైనా కామన్‌సెన్స్‌ ఉండక్కర్లా, దీన్నే నోటిదురుసు అంటారు, ఒకరిని కించపరిచేలా మాట్లాడటం నీకు సరదాగా ఉందా? ఏది పడితే అది వాగడం తగ్గించుకుంటే మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అయితే.. తండ్రి మాట వినలేదని బన్నీ నీకొచ్చి చెప్పాడా? నోటికొచ్చినట్లు వాగుతున్నావ్‌ అంటూ బండ్ల గణేశ్‌ను ఏకిపారేస్తున్నారు.

చదవండి: క్రికెటర్‌తో లవ్‌, ఇప్పుడు మాటల్లేవన్న నటి
పాత ఇల్లు కొని సొంతింటి కల సాకారం చేసుకున్న కమెడియన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top