Sayali Sanjeev opens on her link up rumours with Ruturaj Gaikwad - Sakshi
Sakshi News home page

Sayali Sanjeev: క్రికెటర్‌తో లవ్‌? ఇప్పుడు మాట్లాడుకోవట్లేదన్న నటి

Dec 4 2022 5:38 PM | Updated on Dec 4 2022 6:14 PM

Sayali Sanjeev Open up On Linkup Rumours With Ruturaj Gaikwad - Sakshi

అతడు మంచి ఆటగాడు, దాని గురించి మేం మాట్లాడుకునేవాళ్లం.. కానీ తర్వాత అది కూడా మానేశాం. నిజానికి మా భాగస్వాములను ఎంచుకున్నాకైనా జనాలు మాది స్నేహమని తెలుసుకుంటారులే అనుకున్నా.. కానీ

సినిమా- క్రికెట్‌ది విడదీయరాని బంధం. సినీతారలు క్రికెటర్స్‌ను లవ్వాడటం, కొన్ని జంటలు పెళ్లిదాకా రాకుండానే బ్రేకప్‌ కావడం, మరికొన్ని మాత్రం వివాహంతో బంధాన్ని పదిలం చేసుకోవడం చాలానే చూశాం. అయితే కొందరు వారి ప్రేమను ఫ్రెండ్‌షిప్‌ ముసుగులో దాచేస్తే.. మరికొందరి నిజమైన స్నేహాన్ని జనాలు ప్రేమే అని భ్రమపడతారు. ఇలా సినీతారలు- క్రికెటర్లకు సంబంధించి ఎన్నో వార్తలు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలా మరాఠీ నటి సయాలీ సంజీవ్‌, క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మధ్య ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై సయాలీ సంజీవ్‌ స్పందించింది.

'మా మధ్య ఏం లేదు.. ఈ రూమర్స్‌ వల్ల మా స్నేహం దెబ్బతింది. కనీసం మంచి స్నేహితులుగా కూడా మాట్లాడుకోవట్లేదు. అక్కడ ప్రేమాదోమా ఏమీ లేదు. అయినా మమ్మల్ని ఎందుకు లింక్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీని వల్ల మా వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అది పుకార్లు పుట్టించేవాళ్లకు ఎందుకర్థమవట్లేదు? అతడు మంచి ఆటగాడు, దాని గురించి మేం మాట్లాడుకునేవాళ్లం.. కానీ తర్వాత అది కూడా మానేశాం. నిజానికి మా భాగస్వాములను ఎంచుకున్నాకైనా జనాలు మాది స్నేహమని తెలుసుకుంటారులే అనుకున్నా.. కానీ ఈ పుకార్లు ఇలా వ్యాప్తి చెందుతూనే ఉంటే ఎన్నటికైనా ఇబ్బందేనని గ్రహించాం. ఇంట్లోవాళ్లకు కూడా సమస్యేనని అర్థం చేసుకున్నాం. అతడు ఏదైనా విజయం సాధించినప్పుడు కంగ్రాట్స్‌ చెప్దామనిపించినా ఆ పని చేయలేకపోతున్నా. అతనిది కూడా అదే పరిస్థితి అని చెప్పుకొచ్చింది' సయాలీ సంజీవ్‌.

చదవండి: నాన్న లేడు, పాత ఇల్లు కొన్న కమెడియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement