Avika Gor: అవికా గోర్‌ ‘అగ్లీ స్టోరీ’ | Avika Gor, Nandu To Tells Ugly Story | Sakshi
Sakshi News home page

Avika Gor: అవికా గోర్‌ ‘అగ్లీ స్టోరీ’

Nov 19 2023 11:05 AM | Updated on Nov 19 2023 11:44 AM

Avika Gor, Nandu To Tells Ugly Story - Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్‌ అవికా గోర్‌. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఉత్తరాది భామ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉంది. అందుకే తన కెరీర్‌లో ‘సినిమా చూపిస్త మావ’లాంటి భారీ హిట్‌ అందించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కం వేణుగోపాల్‌ నిర్మాణంలో కొత్త సినిమాను ప్రకటించింది. సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్స్ ని నిర్మించిన బెక్కెం వేణుగోపాల్..రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి 'అగ్లీ స్టోరీ'అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఈ రొమాంటిక్‌ థ్రిల్లర్‌లో నందు హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ గురించి బెక్కెం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు టైటిల్ లాంచ్ జరగగా ఈ చిత్రానికి "అగ్లీ స్టోరీ" అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు 

Advertisement
 
Advertisement
Advertisement