అతియా-రాహుల్‌ పెళ్లి వేదిక.. అదిరిపోయిందిగా! | Athiya Shetty KL Rahul Wedding Venue: Inside Suniel Shetty Khandala Home | Sakshi
Sakshi News home page

Athiya Shetty - KL Rahul: అతియా పెళ్లి జరిగేది అక్కడే, అద్భుతమైన లొకేషన్‌..

Jan 19 2023 9:26 PM | Updated on Jan 19 2023 9:31 PM

Athiya Shetty KL Rahul Wedding Venue: Inside Suniel Shetty Khandala Home - Sakshi

సునీల్‌ శెట్టి కూతురి పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యాడు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇంతకీ పెళ్లి వేదిక ఎక్కడనుకుంటున్నారా?

బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి, క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి కోసం అటు సినీప్రియులు, ఇటు క్రికెట్‌ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెరదించుతూ ఈ నెల 23న ఇరు కుటుంబాల సమక్షంలో వైవాహిక బంధంతో ఒక్కటి కాబోతున్నారు లవ్‌ బర్డ్స్‌. ఇప్పటికే ఇద్దరి ఇంటా పెళ్లి పనులు షురూ అయ్యాయి.

ముంబైలో ఉన్న రాహుల్‌ ఇల్లు అందమైన అలంకరణతో జిగేల్‌మని వెలిగిపోతోంది. అటు సునీల్‌ శెట్టి కూతురి పెళ్లి ఏర్పాట్లలో తలమునకలయ్యాడు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నాడట. ఇంతకీ పెళ్లి వేదిక ఎక్కడనుకుంటున్నారా?

మహారాష్ట్ర ఖాండాలా హిల్‌ స్టేషన్‌లో ఉన్న సునీల్‌ శెట్టి నివాసంలోనే ఈ వివాహం జరగనుంది. ఖాండాల ఇంటి నుంచి కొండలు, చెట్లు, ప్రకృతి ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. ఇక ఇంటిలోపల కూడా ఇంటీరియర్‌ అదిరిపోయింది. ఎంట్రెన్స్‌.. హాల్‌.. డైనింగ్‌ ఏరియా అంతా కూడా అద్భుతంగా డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: ముహూర్తం ఫిక్స్‌.. మంచు మనోజ్‌ ట్వీట్‌ వైరల్‌
డైరెక్టర్‌కు మెగాస్టార్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement