
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'అతడు' రీరిలీజ్ కానుంది. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా (ఆగష్టు 9) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయభేరి ఆర్ట్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రానికి రూ. 7 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే, తాజాగా ఒక మీడియా సమావేశాన్ని మేకర్స్ నిర్వహించారు. అతడు రీరిలీజ్ ద్వారా వచ్చే డబ్బును మహేశ్ బాబు ఫౌండేషన్ కోసం వినియోగిస్తామని ఆయన టీమ్ ప్రకటించింది.
మహేశ్ బాబు ఫౌండేషన్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన నమ్రత, మహేశ్కు వచ్చిందని ఆయన టీమ్ తాజాగా పేర్కొంది. మహేశ్బాబు బర్త్డే సందర్భంగా అతడు సినిమా ఆగష్టు 9న రీరిలీజ్ కానుందన్నారు. ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ మొత్తం మహేశ్‌బాబు ఫౌండేషన్కు ఉపయోగిస్తామని ఆయన టీమ్ తెలిపింది. ముఖ్యంగా చిన్న పిల్లల గుండే ఆపరేషన్స్, పేద పిల్లల చదువు కోసం ఈ డబ్బు ఉపయోగిస్తామన్నారు. గతంలో రీరిలీజ్ అయిన పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా ఫౌండేషన్ కోసం ఉపయోగించామని పేర్కొన్నారు. ప్రతి ఏడాది మహేశ్ బాబు బర్త్‌డే నాడు తను నటించిన సినిమాలలో ఏదో ఒకటి రీరిలీజ్ అవుతుంది. తమ అభిమాన హీరో స్థాపించిన ఫౌండేషన్ కోసం సాయంగా ఉండాలని ఆయన ఫ్యాన్స్ భారీగా సినిమా చూసేందుకు వెళ్తారు.
మహేశ్ బాబు ఫౌండేషన్ గురించి
పేద పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలతో పాటు విద్య, ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సేవలను కూడా మహేశ్ ఫౌండేషన్ అందిస్తుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రి రెయిన్‌బోతో భాగస్వామ్యం కలిగి ఉంది. దీనికి అంబాసిడర్‌గా మహేష్ బాబు కొనసాగుతున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 4,500 కంటే ఎక్కువ ఉచిత గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ట్రస్ట్ బాధ్యతలన్నీ నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి చూస్తుంటారు.
#AthaduHomeComing :
MB ఫౌండేషన్ IDEA #MaheshBabu & #Namratha గారిది, ఇప్పటి దాకా వచ్చిన రీ రిలీజ్ వసూళ్లు అంతా పిల్లల హార్ట్ ఆపరేషన్ కి, EDUCATION కి ఉపయోగపడుతుంది.#Athadu కలెక్షన్స్ కూడా ఫౌండేషన్ కే..#AthaduSuper4K #Athadu4K pic.twitter.com/CNyrp4Ui3m— IndiaGlitz Telugu™ (@igtelugu) July 26, 2025