హం పరమేశ్వరం... | Ashwin Babu Shivam Bhaje Movie Ram Ram Eeswaram Song Released | Sakshi
Sakshi News home page

హం పరమేశ్వరం...

Jul 19 2024 12:49 AM | Updated on Jul 19 2024 12:49 AM

Ashwin Babu Shivam Bhaje Movie Ram Ram Eeswaram Song Released

‘రం రం ఈశ్వరం... హం పరమేశ్వరం... యం యం కింకరం... వం గంగాధరం...’ అంటూ మొదలవుతుంది ‘రం రం ఈశ్వరం’ పాట. అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన ‘శివం భజే’ సినిమాలోనిది ఈ పాట. ఆధ్యాత్మిక అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని అప్సర్‌ దర్శకత్వంలో మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మించారు.

ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రం రం ఈశ్వరం’ పాట లిరికల్‌ వీడియోను సంగీత దర్శకుడు తమన్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. సంగీత దర్శకుడు వికాస్‌ బడిస సారథ్యంలో పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటను సాయిచరణ్‌ పాడారు. ‘‘మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి’’ అన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement