డ్రగ్స్‌ కేసు: అషూరెడ్డితో నిర్మాత వందల ఫోన్‌ కాల్స్‌ | Sakshi
Sakshi News home page

KP Chowdary Drugs Case: అషూరెడ్డితో నిర్మాత వందల ఫోన్‌ కాల్స్‌, ఐటం సాంగ్‌ చేసిన హీరోయిన్‌తో కూడా..

Published Fri, Jun 23 2023 8:49 PM

Ashu Reddy In KP Chowdary Drugs Case - Sakshi

కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తనకు డ్రగ్స్‌ అలవాటు ఉందని అంగీకరించిన నిర్మాత కొందరు ఆర్టిస్టులకు డ్రగ్స్‌ అమ్మినట్లు పోలీసులకు వెల్లడించాడు. రెండు రోజుల పాటు కేపీ చౌదరిని విచారించిన పోలీసులు అతడి ఫోన్‌లో కీలక ఆధారాలను సేకరించారు. కేపీ కాల్‌ లిస్ట్‌ను డీకోడ్‌ చేయగా అతడు అషూరెడ్డితో పాటు టాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌ చేసిన ఓ హీరోయిన్‌తో వందల సంఖ్యలో కాల్స్‌ మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా అతడి ఫోన్‌లో వారితో క్లోజ్‌గా దిగిన ఫోటోలు కూడా లభ్యమయ్యాయి. అయితే కేపీ మాత్రం ఈ కాల్స్‌పై కేపీ నోరు మెదపడానికి నిరాకరించాడు. 

కేపీ లిస్ట్‌లో 12 మంది బడా బాబులు, పలువురు సెలబ్రిటీలు, యువతులు ఉన్నట్లు తెలిసింది. వారితో పాటు.. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్‌ రెడ్డి, నితినేశ్‌, బెజవాడ భరత్‌, శ్వేత, టాగోర్‌ ప్రసాద్‌లు కూడా కేపీ కాల్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నారు. అలాగే నిర్మాత బ్యాంకు ఖాతాలో 11 అనుమానాస్పద లావాదేవీలను సైతం పోలీసులు గుర్తించారు.

కాగా జూన్‌ 14న గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాముల కొకైన్‌ను సరఫరా చేస్తూ కేపీ చౌదరి సైబరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి స్వాదీనం చేసుకున్న నాలుగు సెల్‌ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా డ్రగ్స్‌ పెడ్లర్‌ రాకేశ్‌ రోషన్‌లతో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. మొదట ఎవరికీ డ్రగ్స్‌ అమ్మలేదని బుకాయించిన నిర్మాత రెండురోజులపాటు విచారించగా 12 మందికి డ్రగ్స్‌ అమ్మినట్లు ఒప్పుకున్నాడు.

చదవండి: అవును, నిర్మాత నేను కొట్టుకున్నాం, తిట్టుకున్నాం: హీరో

Advertisement
 
Advertisement