Karmastalam: యోధుడిలా అరవింద్ కృష్ణ | Arvind Krishna First Look Released From Karmastalam | Sakshi
Sakshi News home page

Karmastalam: యోధుడిలా అరవింద్ కృష్ణ

Apr 12 2026 5:38 PM | Updated on Apr 12 2026 5:45 PM

Arvind Krishna First Look Released From Karmastalam

అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాయ్ ఫిల్మ్స్  నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 

ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణ పాత్రకు సంబంధించిన లుక్‌ను, మేకింగ్ వీడియోని షేర్ చేశారు.

అరవింద్ కృష్ణ ప్రస్తుతం సూపర్ హీరో పాత్రలతో ఆడియెన్స్‌ను ఆకట్టునేందుకు రెడీ అవుతన్నారు. ఇలాంటి టైంలో ఓ యోధుడిలా ‘కర్మస్థలం’లో కనిపించబోతోన్నారు. 

తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్, మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక సెట్‌లోనే అరవింద్ కృష్ణ చేస్తున్న వర్కౌట్స్, రిహార్సల్స్ అన్నీ కూడా ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. గుర్రపు స్వారీ కూడా ఈ చిత్రంలో హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది. విజువల్స్, బీజీఎం ఈ సినిమాను అదనపు ఆకర్షణ అయ్యేలా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement