'అందుకే నాపై దుష్ప్రచారం'.. పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు | Singer Mangli Complaint On Advocate Subbarao At Punjagutta Poilce Station | Sakshi
Sakshi News home page

Singer Mangli: ' నా దగ్గర వీడియోలు ఉన్నాయి..' న్యాయవాదిపై మంగ్లీ ఫిర్యాదు

Apr 12 2026 5:22 PM | Updated on Apr 12 2026 6:14 PM

Singer Mangli Complaint On Advocate Subbarao At Punjagutta Poilce Station

టాలీవుడ్ సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించారు.  తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది సుబ్బారావుపై కంప్లైంట్ ఇచ్చారు. తన న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగర్ మంగ్లీ తన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఇటీవల న్యాయవాది సుబ్బారావు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఆ డబ్బులు ఇవ్వనందుకే తనపై మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేసిన వీడియోలు నా దగ్గర ఉన్నాయని మంగ్లీ పోలీసులకు తెలిపారు. తనపై పెట్టిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని సింగర్ అన్నారు. కాగా.. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అడ్వకేట్‌ సుబ్బారావు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

m
 

Advertisement
 
Advertisement
Advertisement