అజిత్‌ సినిమాలో విలన్‌గా పాపులర్‌ హీరో | Arun Vijay To Turn Villain For Ajith Once Again In Ak62 | Sakshi
Sakshi News home page

Ajith Kumar : అజిత్‌ సినిమాలో విలన్‌గా పాపులర్‌ హీరో

Feb 21 2023 5:34 PM | Updated on Feb 21 2023 5:36 PM

Arun Vijay To Turn Villain For Ajith Once Again In Ak62 - Sakshi

అజిత్‌ లేటెస్ట్‌ మూవీ తుణివు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ స్టార్‌ హీరో తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించడానికి కథతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

విఘ్నేష్‌ శివన్‌ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, నిర్మాణ సంస్థకు నచ్చకపోవడంతో ఆయన్ను తప్పించి మగిళ్‌ తిరుమేణిని తీసుకొచ్చారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

అజిత్‌ నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు అరుణ్‌ విజయ్‌ నటించనున్నారట. గతంలో వీరిద్దరు కలిసి గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ఎన్నై అరిందాల్‌ అనే చిత్రంలో నటించారు. అందులో అజిత్‌ పోలీసు అధికారిగా, అరుణ్‌ విజయ్‌ ప్రతినాయకుడిగా పవర్‌ ఫుల్‌ పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజిత్‌ 62వ సినిమాలో కూడా అరుణ్‌ విజయ్‌ ఢీ కొనబోతున్నారన్నమాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement