Arun Vijay Aakrosham Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Aakrosham Release Date: ఆక్రోశం సినిమా రిలీజయ్యేది అప్పుడే!

Dec 7 2022 7:16 PM | Updated on Dec 7 2022 7:29 PM

Arun Vijay Aakrosham Gets Release Date - Sakshi

‘టాలీవుడ్ అంటే నాకు ఎంతో స్పెష‌ల్‌. హైద‌రాబాద్‌కి వ‌చ్చిన ప్ర‌తీసారి నా ఇంట్లో ఉన్న అనుభూతి క‌లుగుతుంది. త‌మిళంలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం’

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజ‌య్ హీరోగా నటించిన చిత్రం ఆక్రోశం. జి.య‌న్‌.కుమార వేల‌న్ దర్శకత్వం వహించాడు. తమిళ హిట్‌ చిత్రం ‘సినం’ను నిర్మాత ఆర్‌.విజ‌య్ కుమార్ తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 16న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో హీరోయిన్ పల్లక్ లల్వాని మాట్లాడుతూ..‘టాలీవుడ్ అంటే నాకు ఎంతో స్పెష‌ల్‌. హైద‌రాబాద్‌కి వ‌చ్చిన ప్ర‌తీసారి నా ఇంట్లో ఉన్న అనుభూతి క‌లుగుతుంది. త‌మిళంలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా సినిమాను ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం’అన్నారు.

హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ 'ఏనుగు సినిమా స‌మ‌యంలో స‌తీష్‌గారితో అనుబంధం ఏర్ప‌డింది. ఇప్పుడు ఆయ‌నే ఆక్రోశం సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఆడియెన్స్‌కు చిన్న‌, పెద్ద అనే తేడా ఉండ‌దు. మంచి  కంటెంట్ ఉంటే ఆద‌రిస్తుంటారు. అలాంటి ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. త‌ప్ప‌కుండా తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది. సినిమా థియేట‌ర్స్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు ఓ ఎమోష‌న్‌తో బ‌య‌టకు వెళ‌తారు. ష‌బీర్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సిల్వ‌గారి యాక్ష‌న్ ఎలిమెంట్స్ కూడా ప్ల‌స్ అవుతుంది' అన్నారు.

చదవండి: నన్ను చావబాదాడు, ఒంటిమీద బట్టలున్నాయో లేదో చూసుకోకుండా పరిగెత్తా

Advertisement
 
Advertisement
Advertisement