ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో పాల్గొన్న నటి | Archana Singh Participated In The Everest Base Camp | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో పాల్గొన్న నటి

May 30 2025 3:43 PM | Updated on May 30 2025 4:12 PM

Archana Singh Participated In The Everest Base Camp

అర్చనా సింగ్... తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా అనిపించినా, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో ఆమె ఓ సుపరిచిత నటి. కన్నడలో కాంతామణిగా పేరొందిన అర్చనా, ఇటీవల హిమాలయాల్లోని "ఎవరెస్ట్ బేస్ క్యాంప్" సాహస యాత్రలో పాల్గొని తన ధైర్యాన్ని చాటింది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేదే తన లక్ష్యమని చెప్పకనే చెప్పింది.

ఎం.బి.ఏ. పట్టభద్రురాలైన అర్చనా, సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, "విప్రో", "ఐ.టి.సి. గ్రూప్ ఆఫ్ హోటల్స్", "కింగ్ ఫిషర్", "జెట్ ఎయిర్‌లైన్స్" వంటి ప్రముఖ సంస్థల్లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. కన్నడ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ అందాల నటి, తెలుగులో "దమయంతి - కౌశిక్ వర్మ" చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం "మై ఫాదర్ - మై హీరో" అనే చిత్రంతో మలయాళంలో అరంగేట్రం చేస్తోంది, ఈ చిత్రం ఇంగ్లీష్‌లోనూ రూపొందుతోంది. శాస్త్రీయ నృత్యంలో నైపుణ్యం కలిగిన అర్చనా, సమయం దొరికినప్పుడల్లా నృత్య ప్రదర్శనలు కూడా ఇస్తుంది. కన్నడ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌లలో స్వీయవంతంగా మాట్లాడే ఆమె, తెలుగు, తమిళ భాషల్లోనూ పట్టు సాధించింది.

ఇటీవల తన "ఎవరెస్ట్ బేస్ క్యాంప్" యాత్ర గురించి మాట్లాడుతూ ..నా కెరీర్ ప్రారంభంలో చేసిన ఉద్యోగాలు, దక్షిణ భాషల సినిమాల్లో నటించడం నాకు ఎంత ఉత్సాహాన్నిచ్చాయో, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్ర అంతకంటే ఎక్కువ ఉత్తేజాన్నిచ్చింది. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పాన్ని, ప్రేరణను ఈ యాత్ర నాలో నింపింది. నాలో దాగి ఉన్న భయాలను, బెరుకును ఈ సాహసం తుడిచిపెట్టింది. ఈ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం." నటన విషయంలో తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ ధైర్యవంతమైన నటి చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement