Aparna Malik Dead Line First Look And Motion Poster Release - Sakshi
Sakshi News home page

Aparna Malik: ‘డెడ్‌లైన్‌’ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

May 5 2022 12:59 PM | Updated on May 5 2022 3:39 PM

Aparna Malik Dead Line First Look ANd Motion Poster Release - Sakshi

అపర్ణా మాలిక్‌ హీరోయిన్‌గా, విలక్షణ నటుడు అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డెడ్‌లైల్‌.  సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ రూపొందిన ఈ సినిమాను శ్రీ విఘ్నతేజ ఫిలిం పతాకంపై బొమ్మారెడ్డి వీఆర్‌ఆర్‌ రచన దర్శకత్వంలో తాండ్ర గోపాల్‌ నిర్మించారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లిం‍ప్స్‌

ఈ సందర్భంగా దర్శకుడు బొమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల గురించి చర్చించే చిత్రమే ఈ డెడ్ లైన్. నేటి యువత అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మా చిత్రాన్ని సరికొత్తగా తెరకెక్కించాం. ప్రేక్షకుడు ఊహించని విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాం. విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు’ అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement