ఒడిషా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, అందాల నటి వేద్విక సోని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం అంతర్యామి. ఈ సినిమాకు శివ సత్యం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానరంజన్ సాహు నిర్మిస్తుండగా.. అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రీకరణ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీజే కార్తికేయన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


