
ఆయ్ ఫేమ్ అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బ్యూటీ. గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు బి.ఎస్. రావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా ‘బ్యూటీ’ టైటిల్‌ను ప్రకటించడంతోపాటు ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను కూడా విడుదల చేశారు. నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శ్రీ సాయి కుమార్ దారా పని చేస్తున్నారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్: బేబీ సురేష్ భీమగాని, ఎడిటింగ్: ఎస్‌బి ఉద్ధవ్.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment