మరో క్రేజీ ప్రాజెక్ట్‌ ప్రకటించిన సూపర్‌ హిట్ డైరెక్టర్! | Sakshi
Sakshi News home page

Anjali Menon: మరో క్రేజీ ప్రాజెక్ట్‌.. కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న అంజలి మీనన్!

Published Wed, Feb 21 2024 4:19 PM

Anjali Menon Announces Next Film With KRG Studios Goes Viral - Sakshi

అంజలి మీనన్‌ మహిళా దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో బెంగళూరు డేస్‌, మంచాడి గురు, ఉస్తాద్‌ హోటల్‌ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆమె దర్శకత్వం వహించిన వండర్‌ ఉమెన్‌ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

తాజాగా అంజలి మీనన్‌ మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈసారి తమిళ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. కేఆర్‌జీ సంస్థ  ఈ మూవీని నిర్మించనుంది. ఈ సంస్థ తొలిసారిగా తమిళంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించింది. అంజలిమీనన్‌ సహా ప్రతిభావంతులైన పలువురు నవ దర్శకులను ప్రోత్సహించే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని తెలిపింది.

మంచి కథ అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఆలోచింప జేసే కథ, కథనాలతో పాటు ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఇచ్చే కథా చిత్రాలను అందిస్తామని చెప్పారు. దర్శకురాలు అంజలిమీనన్‌ మట్లాడుతూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ప్రపంచ స్థాయి కథా చిత్రాలను రూపొందిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

Advertisement
Advertisement