అడ‌గ్గానే అనిరుధ్ పాడేందుకు ఒప్పుకున్నాడు | Anirudh Collaborated with Ganesh Chandrasekaran for Private Music Album | Sakshi
Sakshi News home page

Anirudh: అనిరుధ్‌ నోట ఐత్తలక్కా పాట

Jan 20 2022 2:01 PM | Updated on Jan 20 2022 2:06 PM

Anirudh Collaborated with Ganesh Chandrasekaran for Private Music Album - Sakshi

వీడియో ఆల్బమ్‌ హుషారుగా సాగే పార్టీ ఐటమ్‌ సాంగ్‌గా ఉంటుందని చెప్పారు. తాను అడగ్గానే అంగీకరించిన అనిరుధ్‌ తానే తన స్టూడియోలో పాడిన డెమోను తనకు పంపి ఆశ్చర్యపరిచారన్నారు.

ప్రైవేట్‌ వీడియో ఆల్బమ్స్‌కు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి మంచి హుషారైన ఐత్తలక్కా అనే పల్లవితో సాగే వీడియో ఆల్బమ్‌ సంగీత ప్రియులను అలరించడానికి సిద్ధం అవుతోంది. గణేశ్‌ చంద్రశేఖరన్‌ సంగీతాన్ని అందించిన ఈ ఆల్బమ్‌ కోసం యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ పాడటం విశేషం. ఈ వీడియో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు గణేశ్‌ చంద్రశేఖరన్‌ పేర్కొంటూ ఐత్తలక్కా వీడియో ఆల్బమ్‌ హుషారుగా సాగే పార్టీ ఐటమ్‌ సాంగ్‌గా ఉంటుందని చెప్పారు.

తాను అడగ్గానే అంగీకరించిన అనిరుధ్‌ తానే తన స్టూడియోలో పాడిన డెమోను తనకు పంపి ఆశ్చర్యపరిచారన్నారు. రాజా గురుస్వామి రాశారని, దీనికి మాయోన్‌ ఛాయాగ్రహణం అందించారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దర్శన్‌తో పాటు తానూ నటించిన ఈ ఆల్బమ్‌కు శ్రీధర్‌ నృత్య దర్శకత్వం వహించారని, దర్శకుడు యోగేశ్వరన్‌ సన్నివేశాలను మెరుగు పరిచారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement