‘గాలి సంపత్’ కోసం రంగంలోకి అనిల్‌ రావిపూడి | Anil Ravipudi supervises direction for Sree Vishnu starrer Gaali Sampath | Sakshi
Sakshi News home page

‘గాలి సంపత్’ కోసం రంగంలోకి అనిల్‌ రావిపూడి

Jan 23 2021 5:44 AM | Updated on Jan 23 2021 11:43 AM

Anil Ravipudi supervises direction for Sree Vishnu starrer Gaali Sampath - Sakshi

లొకేషన్లో సీన్‌ గురించి చర్చిస్తూ రాజేంద్రప్రసాద్, అనిల్‌ రావిపూడి...

శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్‌ హీరోహీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్‌ గాలి సంపత్‌గా టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్‌’. హిట్‌ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో అనీష్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అనిల్‌ రావిపూడి సమర్పణ, స్క్రీన్‌ ప్లేతో ఆయన కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్‌. కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మాకు చాలా స్పెషల్‌. అందుకే నా పూర్తి సహకారాన్ని అందిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాను’’ అన్నారు.

ఎస్‌. కృష్ణ మాట్లాడుతూ – ‘‘నా మిత్రుడు అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి బ్యాక్‌ బోన్‌గా నిలబడడమే కాకుండా స్క్రీన్‌ ప్లే, సమర్పణతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఫైనల్‌ షెడ్యూల్‌ జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: ఎస్‌. కృష్ణ, రచనా సహకారం: ఆదినారాయణ, మాటలు: మిర్చి కిరణ్, కెమెరా: సాయి శ్రీ రామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాగమోహన్‌ బాబు. ఎమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement