అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా ‘లెహరాయి’ మూవీ సెకండ్‌ సాంగ్‌

Anil Ravipudi Launches Arey Cheppaku Ra Sorry Song From Leharayi Movie - Sakshi

‘లెహరాయి’ చిత్రం నుంచి మరో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. రామకృష్ణ పరమహంస దర్శకుడిగా పరిచమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్‌ టాలెంటెడ్‌ రంజిత్‌, సౌమ్య మీనన్‌ హీరోహీరోయన్లు నటిస్తున్నారు. ధర్మపురి ఫేం గగన్‌ విహారి, రావు రామేశ్‌, సీనియర్‌ నరేశ్‌, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదలై ‘గుప్పెడంత’ ఫస్ట్‌సాంగ్‌ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.

అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ అంటూ సాగే ఈ పాటను సింగర్‌ సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్థలో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ సినమాను నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామాని ఈ సందర్భంగా మేకర్స్‌ తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top