Andrea Jeremiah: తెలుగులో ఫస్ట్‌టైం డబ్బింగ్‌ చెప్పిన పిశాచి హీరోయిన్‌

Andrea Jeremiah Dubbing For Pisachi 2 in Telugu For the First Time - Sakshi

పిశాచి తెలుగు డబ్బింగ్‌ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండీ, పిశాచి 2 సినిమా కోసం నటి ఆండ్రియా తొలిసారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నటిగా, గాయనిగా సత్తా చాటుతున్న బోల్డ్‌ బ్యూటీ ఆండ్రియా బహుభాషా నటి కూడా!

ఆండ్రియాలో మంచి కవయిత్రి కూడా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం పిశాచి 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మిష్కిన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై టి.మురుగానందం నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న పిశాచి 2 చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో ఆండ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుననారు.

తమిళం, మలయాళం సరే తెలుగులోనూ తానే డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఇందుకోసం ఆమె ట్యూటర్‌ను నియమించుకుని తెలుగు వాచకం నేర్చుకుని డబ్బింగ్‌ చెబుతున్నారు. అలా పిశాచి చిత్రం కోసం ఆండ్రియా చెప్పిన డైలాగ్‌ నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడి నుంచి ఎవరూ ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. తాను డబ్బింగ్‌ చెబుతున్న వీడియోను ఆండ్రియా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఫస్ట్‌ టైం తెలుగులో డబ్బింగ్‌ చెబుతున్నాను అంటూ ఎగ్జైటింగ్‌తో కూడిన ఆనందంతో పేర్కొన్నారు. ఆండ్రియా కృష్టిని నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

చదవండి: ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?.. డైరెక్టర్‌ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!
పక్కనోడి లైఫ్‌ నీకెందుకు?: ట్రోలర్స్‌కు నటుడి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top