Anchor Vishnu Priya Mother Passed Away - Sakshi
Sakshi News home page

Vishnu Priya: విష్ణుప్రియ తల్లి కన్నుమూత, యాంకర్‌ భావోద్వేగ పోస్ట్‌..

Jan 27 2023 9:53 AM | Updated on Jan 27 2023 10:28 AM

Anchor Vishnu Priya Mother Passed Away - Sakshi

నా ప్రియమైన అమ్మ.. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత కూడా!

యాంకర్‌ విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఆమె తల్లి కన్నుమూశారు. తన తల్లి మరణవార్తను సోషల్‌ మీడియాలో వెల్లడించింది విష్ణుప్రియ. 'నా ప్రియమైన అమ్మ.. ఈ రోజువరకు నువ్వు నావెంటే ఉన్నందుకు వేవేల కృతజ్ఞతలు. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తాను. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత కూడా! నువ్వు ఈ అనంత విశ్వంలో కలిసిపోయావు. ప్రతిచోటా.. నా ప్రతి ఊపిరిలోనూ నువ్వే ఉంటావు. 

నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడ్డావు. నా కోసం చేసిన త్యాగాలకు, నాపై కురిపించిన ప్రేమకు నీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. దీనికి తల్లితో కలిసున్న ఫోటోను జత చేసింది. కాగా విష్ణుప్రియ, జబర్దస్త్‌ రీతూ చౌదరి మంచి ఫ్రెండ్స్‌ అన్న విషయం తెలిసిందే! ఇటీవలే వీరిద్దరూ వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. ఈ మధ్యే రీతూ చౌదరి తండ్రి మరణించగా తాజాగా విష్ణుప్రియ తల్లిని కోల్పోవడంతో ఇద్దరి ఇంట విషాదచాయలు నెలకొన్నాయి.

చదవండి: జమున కన్నుమూత
కోలీవుడ్‌ విలన్‌తో ప్రేమలో నటి

Advertisement
 
Advertisement
Advertisement