ఇది నిజమేనా అంటూ రవిని క్వశ్చన్‌ చేస్తున్న యాంకరమ్మలు

Anchor Ravi Wife Nitya Funny Reaction To His Latest Instagram video - Sakshi

యాంకర్‌ రవి..బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తాడు. ఇక సోషల్‌ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌తో టచ్లో ఉంటాడు. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మగువా మగువా పాట స్పూఫ్‌ చేశాడు. పురుషా పురుషా అంటూ సాగే ఈ  పేరడి పాటకు రీల్స్‌ చేశాడు. ఇందులో ఇంట్లో పనులంతా తానే చేస్తున్నట్లు వీడియో రూపొందించాడు. ఇళ్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, వంటలు చేయడం, పాపను రెడీ చేయడం ఇలా అన్ని పనులను తానే చేసినట్టుగా రీల్స్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇది ఇన్‌స్టాలో తన 400వ పోస్ట్‌ అని, దీన్ని మగజాతి ఆణిముత్యాలకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.

రవి చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. యాంకర్‌ వర్షిణి, వింధ్యా సహా పలవురు రవి వీడియోపై స్పందించారు. ఇంట్లో ఖాళీగా సోఫాలో కూర్చొని టీవీ చూడటం తప్పా ఇంకేం చేయవు..నువ్వు ఇన్ని పనులు చేశావా అంటూ సెటైర్లు వేశారు. మరికొందరేమో నీ భార్య నిత్యతో పనులు చేయించి నువ్వు రీల్స్‌ అప్‌లోడ్‌ చేస్తున్నావా అంటూ గాలి తీశారు. కాగా ఈ వీడియోపై రవి భార్య నిత్య కూడా స్పందించింది.  ఈ వీడియోల వెనుక ఏం జరిగింది మేకింగ్‌ వీడియోలు పెట్టమంటావా అని ఫన్నీగా బెదిరించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని రవి ఎన్ని వీడియోలు పెట్టినా మా ఉద్యమం ఆగదు అంటూ కామెంట్‌ చేశాడు. 

చదవండి : యాంకర్‌ రవి కారులో.. సీక్రెట్స్‌ బయటపెట్టేసిన లాస్య
'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top