
యాంకర్ రష్మీ పేరు చెప్పగానే జబర్దస్త్, సుడిగాలి సుధీర్‌తో పాటు 'గుంటూరు టాకీస్' తదితర సినిమాలు గుర్తొస్తాయి. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ గత పదేళ్లలో ఈమె లైఫ్ చాలా మారిపోయింది. యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్థికంగానూ కాస్త స్థిరపడిందని చెప్పొచ్చు. రీసెంట్‌గానే అంటే ఏప్రిల్‌లోనే కాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం దాని నుంచి కోలుకుంటూనే మరోవైపు షోలు చేస్తోంది. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది.
'వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కాస్త ఇబ్బందులో ఉన్నాను. అలానే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక నాకు లేదు. అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్లీ బలంగా, ధైర్యంగా తిరిగొస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. నా శక్తిని నేను పునరుద్ధరించుకోవాల్సిన అవసరముంది. దానికి మీ డిజిటల్ ప్రోత్సాహం అవసరం లేదు'
(ఇదీ చదవండి: తల్లి సమాధి దగ్గర మంచు లక్ష‍్మి.. వీడియో)
'నా ఆత్మవిశ్వాసంతో దాన్ని సాధించుకోలగను. నా దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడు కోల్పోలేదు. అదెప్పుడు నా దగ్గరే ఉంది. అయితే ఎక్కడో ఓ చోట కృంగిపోతున్నాను. వీటన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సిన సమయం దగ్గరపడింది. సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా లేకపోయినా మీ ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను' అని రష్మి రాసుకొచ్చింది.
బహుశా సర్జరీ తర్వాత మానసికంగా రష్మీకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? అని ఇవి చూసిన తర్వాత సందేహం కలుగుతోంది. అలానే వృత్తిపరంగానూ ఇబ్బందులు అంటే షోలు వల్ల రెవెన్యూ ఏమైనా తగ్గిందా అని కూడా అనిపిస్తుంది. ఏదేమైనా రష్మి త్వరగా కోలుకుని తిరిగి రావాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
(ఇదీ చదవండి: వరలక్ష‍్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)